రహస్యం చెబుతున్నా!;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
రహస్యం చెబుతా
వింటారా
రచ్చచేయకుండా
ఉంటారా

పిల్లలు రహస్యంవినగానే
మరచిపోతారు
పక్కవాళ్ళతోనూ
ప్రస్తావించరు

బుధులకు రహస్యంచెబితే
బుద్ధిగా వింటారు
బహిరంగం చేయక
భద్రంగా దాచుకుంటారు

మగవారు రహస్యంచెబితే
ఒక చెవితోవింటారు
మరో చెవితో
వదిలేస్తారు

ఆడవారికి రహస్యంవెల్లడిస్తే
రెండుచెవులతో
వింటారు
నోటితోవదిలేస్తారు

ఇది మగువలకు
పాండవాగ్రజుడు
ధర్మరాజిచ్చిన
రహస్యశాపం

కొండమీద
కోలాహలమేమిటంటే
కోమటోళ్ళ
రహస్యమనివిన్నారా

రహస్యాన్ని కొందరు
ఆయుధంగా తీసుకుంటారు
బహిరంగం చేస్తామంటారు
బెదిరిస్తారు భయపెడతారు

గుప్పెట్లో దాస్తే
రహస్యం
పదిమందికి తెలిస్తే
బహిరంగం

చెప్పకు చెప్పకు
రహస్యాలను
భార్యకు కూడా
చెప్పకు చెప్పకు

రహస్యం చెబితే
ఊరు గొల్లుమంటుంది
కొంపలకు
నిప్పు అంటుకుంటుంది


కామెంట్‌లు