న్యాయాలు-14
ఇషు వేగ క్షయ న్యాయము
*****
ఇషు అంటే బాణము అని అర్థం. వేగ అంటే వేగము.క్షయము అంటే క్షీణించు లేదా నశించు అని అర్థం.
ధనుస్సు లేదా అమ్ముల పొది నుండి లక్ష్యాన్ని ఛేదించేందుకు ఎక్కుపెట్టిన బాణము, ఆ లక్ష్యాన్ని చేరేంత వరకూ తన యొక్క వేగాన్ని కోల్పోదు లేదా క్షీణించదు, నశించదు అని అర్థం.
కొందరి పట్టుదల చూస్తే ఆశ్చర్యం ,ఆనందం కలుగుతాయి. వాళ్ళు అనుకున్నది సాధించేంత వరకు ఎన్ని ఆటంకాలు, అవరోధాలు ఎదురైనా వాటికి భయపడకుండా తమ లక్ష్యాన్ని చెరుకుంటారు.
వారిలో మొదటి నుంచి చివరి వరకు అదే వేగం ఉత్సాహం,పట్టుదల,కృషి, తపన ఏమాత్రం తగ్గవు.అలాంటి వారికి సంబంధించి ఈ ఇషు వేగ క్షయ న్యాయమును ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
విద్యార్థులు కానీ, ఏదైనా వినూత్నమైన ఆవిష్కరణలు చేయువారు కానీ ఇలా ఇషు వేగ క్షయ న్యాయమును పాటిస్తే తప్పకుండా తమ తమ రంగాలలో అనుకున్న లక్ష్యాన్ని అలవోకగా ఛేదించగలరు.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి