అవమానం జరుపబడును!!?;--సునీతా - ప్రతాప్, ఉపాధ్యాయిని పాలెం.
ఆకలిగొని
అన్నం పెట్టండి అని అడుక్కోకండి
అక్కడ అన్నం కాదు
అవమానం దొరుకుతుంది!!

వయసు వచ్చి
పెళ్లి కోసం ఐ లవ్ యు చెప్పకండి
ప్రేమ కాదు
అవమానం దొరుకుతుంది!!

ఉన్నత చదువులు చదివి
ఉద్యోగం కోసం
ఉన్నవాళ్లను ఉద్యోగం అడగకండి
అక్కడ ఉద్యోగం కాదు
అవమానం దొరుకుతుంది!!!

ఇల్లు లేదు
అద్దెకు ఇల్లు అడగకండి
అక్కడ ఇల్లు కాదు
అవమానం దొరుకుతుంది!!!

డబ్బు లేక
గొప్ప వాళ్లను డబ్బు కోసం అడగకండి
అక్కడ అప్పు కాదు
అవమానం దొరుకుతుంది!!!

ఉన్నవాళ్ల వెంట
మూడు అడుగులు కూడా వేయకండి
ఆర అడుగు తర్వాత
వాళ్లు కారులో వెళ్తారు నీవు కాళ్లతో వెళ్లాలి
అక్కడ నీకు కారు కాదు
అవమానం దొరుకుతుంది!!!

ఈ ప్రపంచంలో
ఏం జరిగినా సంచలనమే కానీ
నీకు అవమానం జరిగితే మాత్రం
చీమ కూడా కుట్టదు!!?

మనది
అవమానం జరుపబడును
అనే స్వరాజ్యం!!?

దయచేసి దేవున్ని
అవమానం చేయకండి!!

కాళ్లకు చెప్పులు వదిలి గుళ్లోకి రండి
అంతేగాని
చెప్పులు వదిలి రమ్మన్నారని
కాళ్లనే నరుక్కోకండి!
చెప్పులకే అవమానం జరుగుతుంది!!?

అవమానానికే-అవమానం అనే
మందు కనిపెట్టబడింది
అదే ధనం-జనం
ఉంటే కొనండి, లేకుంటే అమ్మండి!!!?

Sunita Pratap teacher palem nagarkurnool dist 🙏🙏
8309529273

కామెంట్‌లు