మ అక్షర గేయం;--గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు.
మ నసు మంచిగుండాలి
మ నిషి వోలె బ్రతకాలి
మ త్సరమే వీడాలి
మ నిషితనం పండాలి

మ కిలి గుణం పోవాలి
మ ణిదీపమే కావాలి
మ చ్చ లేని నడవడితో
మ హిని యందు వెలగాలి

మ ల్లె రీతి విరియాలి
మ మతలెన్నొ కురియాలి
మ లినమంత మదిలోన
మ టుమాయమవ్వాలి

మ ర్యాదగా నడవాలి
మ గధీరలా సాగాలి
మ ట్టిలో మాణిక్యమై
మ ధుమాసమవ్వాలి


కామెంట్‌లు