తుషార శీతల సరోవరాన
చిటారు కిరణాల పలకరింపులు
మది నిండిన కలతలన్ని
మంచులా కరుగుతూ ఆనందాలు
జలతారు జిలుగుల
జిగేలుమంటున్న దిగంతాలు
బంగరు వర్ణాలు పొంగారు
వేడుకల సంబరపడుతున్న అంబరాలు
హిమ మయమైన శిల కూడా
తొలగించుకుంటున్న మంచుపొరలు
అలల కదలికలే ఆగిపోయిన
కొలనిలో నును వెచ్చని కదలికలు
మయూఖ పంక్తుల మొహరించి
జగతిని మేలుకొలిపే వెలుగులు
ఎదురులేని నిశ్శబ్దానికి
జవాబుగా వచ్చిన వేకువలు
సుదూర తీరాల కబురులేవో
అందుకుని మురుస్తున్న కాసారాలు
వెండి నింగి ఉంగరంలో
రత్నమై భాసిల్లు భానుమూర్తికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి