రైతన్నల శ్రమను చూసి...
కరుణించినధాన్యలక్ష్మి...
ఎడ్ల బండ్లెక్కి వచ్చింది... !
మూడురోజుల పెద్ద (ల)పం డుగను వేడుకగా తెచ్చింది...!!
చలి పులిని తరిమమంటలో....
చెత్తనంతనూ తాగులబెట్టి
ఇల్లూ -ఒళ్ళూ శుభ్రముతో
మొదలయ్యే భోగీ పండగ
ముంగిళ్ళలో ముచ్చట గొలిపే
రంగవల్లులు... !
హరిలోరంగ యనే...
హరిదాసుల కీర్తనలు.. "
డూ - డూ బసవన్నల...
గంగిరెద్దు ఆటలు... !
కొమ్మదాసరుల హడావుడి... !
ఆడపడుచుల ముఖాలన్నీ
పసుపూ - కుంకుమ పూతలు !
కొత్తబట్టలు - పిండివంటలు !
దివికేగిన పెద్దలందరికి....
భక్తి -శ్రద్దలతో....
పొత్తర్లూ.... ఉపారాలు !
సంక్రాంతి పెద్ద సంబరమే.. !!
వ్యవసాయంలో...
తమకుసహకరించినపశువులకు...ప్రియమారగపూజలు
ఒకవైపు....,
బ్రాoదీ,బీరు, సారాలు...
కోడె-గొర్రె మాంసాలు...
ఎడ్లపందాలు - కోళ్లపందేలు
ఉల్లాసంగా - ఉత్సాహంగా
ఊరి చివర ఏటి ఒడ్డున..
సాయంకాలపు జాతర !
మూడవరోజు... కనుమపండుగిది.... !!
కష్టాలు, కలతలు....
కన్నీళ్లను మరిపించీ...
పేదాగొప్పా తేడాలేక...
ఊరూ వాడా జరుపుకునే
ఆనందాల పండుగిది.... !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి