*పురందరదాసు - శ్రీనివాసుని దర్శనం*
 *నిత్య కళ్యాణ ప్రియుడు - కళ్యాణ వేంకటేశ్వరస్వామి - కలియుగ ప్రత్యక్ష దైవం - ఎన్ని సార్లు, ఎంత మంది, ఎలా దర్శించుకున్నా, మరోసారి చూడగానే ఇంకా అందంగా మనల్ని తన మాయలో పడవేసే ఆపద మొక్కుల వాడు ఆంజనేయ వరదుడు - ఎంత చెప్పినా తక్కువే - ప్రతీ సారీ మన మనసులో కొత్త భావాలు నింపుతాడు - ప్రతీ మారూ జన్మ ధన్యమైంది అనుకునేటట్టు చేస్తారు.*
*కర్నాటక సంగీత త్రిమూర్తులలో త్యాగరాజు గారు మనకు రాముణ్ణి చెవులతో చూసేటట్టు చేసారు, తన సాహిత్య సంగీతాలతో. అలాగే, తాళ్ళపాక అన్నమాచార్యుల వారు తమ పద సాహిత్యంతో, వేంకటేశ్వరుని మన తెలుగు వారి ఇళ్ళ లోగిళ్ళలో తిరుగాడేటట్టు చేసారు. భక్తి భావం ప్రతీ లోగిలో పొంగి పరిలింది.*
*మన తెలుగు వారికి త్యాగయ్య, అన్నమయ్య ఆరాధ్యులైనట్లే, కన్నడిగులకు పురందరదాసు ఆరాధ్యడు. పురందరదాసును  కర్నాటకలో సంగీత పితామహుడుగా గౌరవిస్తారు. వీరికి విఠలుడు ఆరాధ్య దైవం. ఈ పురందరదాసు తిరుపతి వచ్చినప్పుడు, వేంకటేశ్వర స్వామిని సప్త విధాలుగా దర్శనం చేసుకున్నారట. ఆ సప్త విధాలు ఇప్పుడు తెలుసుకుందాము, "సప్తగిరి - తి.తి.దే.మాస పత్రిక" సౌజన్యంతో*
*౧. *"స్వప్న శ్రీనివాసుడు" - నిత్య సంచారులైన హరిదాసులు ఎప్పుడూ భగవంతుడు తనవెంట ఉన్నాడు అనే భక్తి భావనలో ఉంటారు. వారు ఏపని చేస్తున్నా భావనలో పరమాత్ముని చూస్తూనే ఉంటారు. పురందరదాసు తమ ఈ అవస్థలో వేంకటేశ్వరుని ఇలా దర్శించుకున్నారు.*
*"కనసు కండనె మనదల్లి కళవళ కొండెనె, ఏనుహేళలి తంగి తిమ్మయ్యన పాదవను కండె" - ఏడుకొండల వాడు, తిరునామంతో, గజ్జెలు కట్టిన పాదాలతో, మకర కుండలాలు ధరించి, తులసి మాలలతో మెరసి పోతూ దేవతలు పల్లకిలో తీసుకుని రాగా, రంగనాధుడు ఉత్సవమూర్తిగా నా ముందు నిలుచున్నారు.*
*౨. *"సన్నిధి శ్రీనివాసుడు" - ఏడుకొండలవాడి చెంత పుష్కరిణి లో పవిత్ర స్నానం చేసి, వరాహస్వామి ని పూజించి, మాడ వీధులలో ప్రదిక్షణ చేసి, మహాద్వారం దాటి ధ్వజస్తంభానికి నమస్కారం చేసి, గర్భాలయంలో స్వామిని కన్నులారా చూచి మురిసిన మనసుతో ఐదు పదాలు రాశారట. వేయి సూర్యకాంతులతో మెరుస్తున్న కిరీటం, వైజయంతీ మాల, కటి వరద హస్తాలతో, శంఖ చక్రాలతో విఠలుడే కనిపించాడట అక్కడ స్వామి స్థానంలో పురందరదాసు కు. అప్పుడు ఇలా పాడారు, "నిన్న దివ్యమూరితియ కన్ను దణియ నోడి, ధన్యనాదెనో ధరియెళు".
౩. *" ఉత్సవ శ్రీనివాసుడు" - తిరుమల బ్రహ్మోత్సవాలలో విశేషంగా భక్తులు పాల్గొంటారు. గరుడోత్సవం రోజు పురందరదాసు గారు కూడా బ్రహ్మోత్సవాలలో స్వామిని దర్శించుకుని కొన్ని కీర్తనలు కూడా చెప్పినట్టు చరిత్ర చెపుతోంది.*
౪. *"అభేద శ్రీనివాసుడు" - దశావతారాలు ఎలాగో, అలాగే అర్చామూర్తులు కూడా. ఏయే భక్తడు ఎలా చూడాలనుకుంటే వారికి అలా దర్శనం ఇచ్చినవాడే పరమేశ్వరుడు. కాబట్టి, పరమేశ్వరునికి అర్చామూర్తులకు భేదం లేదు. పురందరదాసు గారు తిరుమలలో శ్రీనివాసుని చూసి, "శరణు శరణు నిన గెంబెనో విఠల, కరుణానిధి యెంబె కాయయ్య విఠల" అని వేడుకున్నారు. రాముణ్ణి, కృష్ణుణ్ణి, ఏదేవతా మూర్తిని చూసినా దాసు గారికి విఠల దర్శనమే అయ్యింది. అందుకే, "అభేద శ్రీనివాసుడు".
౫. *"అలంకార (వివిధ రూపాల) శ్రీనివాసుడు" - ఈ జగత్తు మొత్తం స్వామియే అయినప్పుడు, వారి రూపాలు ఎన్నో లెక్కింపు కుదురదు కదా. ఒక సందర్భంలో, వేంకటపతి, పురందరదాసుకు వైద్యడుగా కనిపించారట. "వైద్య బంద నోడి వేంకట నెంబ, వైద్య బంద నోడి" అన్నారు.*
*ముల్లోకాల బాధలను తీర్చగల వైద్యుడు, భవరోగాలను ఒదిలించె వైద్యుడు, అనేకానేక రోగాలతో, జన్మజన్మలుగా పట్టి పీడిస్తున్న పాపాల రోగాలను పారద్రోలగలిగే వైద్యడు, భవరోగాలు, వాసనా రోగాలు తరిమివేయగల వైద్యుడు వచ్చాడు. ఇక భయపడకండి. ఇంతకంటే గొప్ప వైద్యుడు ఈ జగత్తు మొత్తం వెతకినా ఎక్కడా దొరకడు. చక్కని హస్తవాసి గలిగి రోగాలగుట్టు తెలిసిన వైద్యుడు వచ్చాడు. భయాన్ని వదలి ఆయన చరణావిందాలను పట్టుకోండి. రోగాలు మాయమౌతాయి.*
౬. *"మానస శ్రీనివాసుడు" - మనలో చాలా మంది దేవాలయాలకు వెళ్ళలేక పోయినప్పుడు, నిత్య పూజ చేయలేనప్పుడు పరమేశ్వరుని మనసులోనే చూసుకుని, దర్శనం, పూజ అయ్యింది అనుకుంటాము. అలాగే, పురందరదాసు కు ఈ అనుభవం కలిగినప్పుడు "ఎన్న బిట్టు నీనగలిదరు శ్రీనివాసు, నిన్న నంబిద దాస నల్లవేనో" అన్నారు. ఓ శ్రీనివాసా! నిన్ను నమ్ముకున్న దాసుణ్ణి. నన్ను వదలి పెట్టి ఎక్కడకూ వెళ్ళకు, నీకు నా శరీరాన్ని గుడిగా చేసి, మనసును మంటపం చేసి, నీ పూజ చేయాలని ఎదురు చూస్తున్నాను. దేవతలందరి పూజలు అందుకునే వెంకన్నా, త్వరగా రావయ్యా!"*
౭. *"సంప్రార్ధన శ్రీనివాసుడు" - భగవంతునికి, భక్తునికి మధ్య సేవిచేసే వాడు, సేవింపబడే వాడు; తల్లి బిడ్డ, ప్రేయసి ప్రయుడు వంటి అనుబంధం ఉంటుంది. ఈ బంధాన్ని వివరిస్తూ "ఈ జీవనిందు ఫలనేను రాజీవలోచన మరెదిహ తనువిదలి" అని; సంస్కృతం లో "వేంకటాచలనిలయం వైకుంఠ పురవాసం" అని పాడారు.
*"సప్తగిరి - తి.తి.దే.మాస పత్రిక" సౌజన్యంతో*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
సాహితీ ప్రియులకు అపురూప కానుక పొయిట్రి వర్క్ షాప్;-- యామిజాల జగదీశ్
చిత్రం
చిత్రం ;సాక్షి- 9వ తరగతి
చిత్రం