హక్కు - బాధ్యత @ కోరాడ నరసింహా రావు !
  దిగులు పడకు.... 
    నీకు నీడై నేనుంటాను !
      నాకు తోడై నీవుండు !!
        మనమిరువురం... 
      ఒకరికి ఒకరై ఉందాం !
  ఓసి పిచ్చిదానా.... 
     అడ్డాలనాడే  బొడ్డలే.. !
   గడ్డాలు - మీసాలు... 
       వచ్చినాక కాదె... !
  ఐనా... వాళ్ళనిమాత్రం... 
     ఎలా అనగలం.... !
   వాళ్ళ బ్రతుకులుసైతం... 
     వాళ్లు బ్రతకలేని రోజులివి 
      ఇంక మన భారం... 
   వాళ్ళేం మోయగలరు పాపం!
బాధ  లేదులే....ఒకవేళ... 
 మనమెవరం ముందు పోయినా...ఇరుగు - పొరుగు 
 కాటికీడ్చేయారూ.... !
  మిగిలిన ఒకరికి.... !?
  ఆ దేవుడే దిక్కు... 
   యే మహాత్ముడి రూపంలోనో వచ్చి ఆదుకోక పోడు లే  !! 
ఐనా... నీ పిచ్చిగానీ !
    కన్నందుకు... మనం... 
    వాళ్ళను పెంచి,పోషించా మని, ఇప్పుడు వాళ్ళని పోషిం ఛమనటానికి ఇదేమైనా... 
వ్యాపారమా...!,
       అదిమనబాధ్యత!!
  
ఇప్పుడు మమ్మల్ని పెంచేతీరా
లి అనటం... మనకు హక్కేమీ కాదు... !
     *******

కామెంట్‌లు