నా సూర్యుడు ఉదయమే అందరికోసం
నిదుర లేచి పొద్దు తెలుపు నవనీతమనసు
తనకై తాను కాక, వెలుగు పంచు,వేడి నింపు,
సర్వజీవులకు తన పరిశ్వంగంతో నింపు!!
మహోన్నతుడు మహిమాన్వితుడు
తాను దగ్ధంమౌతూ మంటలలోనె
మహికి వలసిన వేడిమి సమకూర్చి
సర్వాంగ సుందరంగా ప్రకృతిని దిద్దు
మహనీయుడు!!!
ఆశించడు, ఆదరణ తెలుసు
ఆత్మీయుడు, ఆత్మీయత నింపు,
మంచివాడు, చెడు లేదు, కుళ్ళు లేదు
కపటం లేదు, అన్ని సమానమే అంటాడు !!!
అన్ని అందించే చేయి దయా స్వరూపి
చిగురించిన పొద్దులో నిండుమనసుతో
ఒక్క నమస్కారము మనసు నిండ,
ఎవ్వరూ సరికారు!!!
ఆకాశాన సూర్యుబింబం ఒక్కటే
అందుకే ఉన్నంతవరకు ఆశీస్సులు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి