అందరూ
పొదుగుల్లోంచి
వెన్నెల పితుకుతుంటే
కన్నెపిల్లలు
చంద్రుని మచ్చలను
కడిగి వేస్తున్నారెందుకు!!!?
ముఖాలన్నీ
తెల్ల రంగులో ఉంటే
బంగారు తొడుగు
తొడుగుతున్నారెందుకు!!?
చీకటి వెంట్రుకల్ని
ఆకాశం పై పరిచి
అద్దం ముందు అర్ధనగ్నంగా
నెలవంక వంక చూస్తారు ఎందుకు!!?
అబద్ధపు రాత్రిని సృష్టించి
వెన్నెలను త్రాగిన మైకంలో
అచ్చం చంద్రునిలా కనిపిస్తుంటే
అద్భుతం జరిగినట్లు
నటిస్తారు ఎందుకు!!?
చల్లనిది మేఘం చంద్రుడు కాడు
తెల్లనిది చంద్రుడు కారు మేఘం కాదు!!
తల్లి లాంటి మేఘం
తలంటీ
చల్లని చంద్రుని
తయారు చేస్తున్నారెందుకు!!?
నదికి దారి లేదు
నది దారి తప్పదు నది సాగుతుంది
ఆకాశంలో పారేనది చంద్రుడు
దారి తప్పిందని
దిగులు పడతారెందుకు!!?
నీలి మేఘాలలో
చిక్కుకున్నాడని మరిచి
ఆకాశాన్ని తగలబెడతారు ఎందుకు!!?
తారలు భూమికి దిగితే
చంద్రుడు చీకట్లో చిక్కుకుంటాడు
రాత్రి,
చీకటి కురిసిన రాత్రి గాని మిగిలిపోతుంది.
చందమామ కన్నుమూయదు
కంటికి కనిపించదు అంతే!!?
దగదగా మెరిసే
శరీరాల్ని
మచ్చలతో నింపకండి!!?
తరతరాలు
తరలిపోయిన
చెక్కుచెదరని
తారల్ని చూడండి!!?
వెలుగుల్ని త్రాగండి
వెన్నెల్నివ్వండి!!!!
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏🙏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి