న్యాయాలు-13
అసిధారా మధులేపన న్యాయము
******
అసి అంటే కత్తి.అసిధార అంటే కత్తి యొక్క అంచు.మధువు అంటే మకరందం లేదా తేనె. మధు లేపనము అంటే తేనె పూసిన అని అర్థం.
మరి తేనెకు ఆశపడి కత్తిని నాకితే తీయగానే ఉంటుంది. కానీ మరో వైపు నాలుక తెగిపోయే ప్రమాదం కూడా ఉంది.
అది కత్తి అన్న విషయాన్ని మరిచి పోయి తేనెకు ఆశపడితే నోరు తీపి అవడమేమో గానీ నాలుక తెగిపోతుంది.
ఓకే సమయంలో ఆనందం, బాధ రెండు రకాల అనుభవాలను చవి చూడవలసి వచ్చినప్పుడు ఈ న్యాయాన్ని ఉదాహరణగా చెబుతుంటారు.
మోసం చేసే వారి మాటలు కూడా చాలా తీయగా నమ్మదగినవిగా ఉంటాయి.ఆ విషయంలో పూర్వాపరాలు ఆలోచించకుండా ఆ మాటల తీయదనాన్ని నమ్మితే కలిగేది నష్టమే.
అందుకే అంటుంటారు తేనె పూసిన కత్తి లాంటి కొందరు తీయగా మాట్లాడి గొంతు కోస్తారని. వారి వల్ల పొందే తాత్కాలిక సంతోషం కంటే అధిక దుఃఖాన్ని అనుభవించ వలసి వస్తుందని.
ముందు అది కత్తి అన్నది గమనించాలి.దానికి తేనె పూసిన,రాసినా దాన్ని సేవించడంలో అప్రమత్తత లేకపోతే అపాయం బారిన పడతామని తెలుసుకోవాలి.
కాబట్టి ఆనందాన్ని మించి ఆవేదన కలిగించే అసిధార మధులేపన న్యాయమునకు దూరంగా ఉండటమే మంచిది కదా!.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి