న్యాయము -7
అవినాభావ సంబంధ న్యాయము
*****
అవినాభావ సంబంధం అంటే ఒకదాని కొకటి విడదీయలేకుండా ఉండే బంధం.
ఇలాంటి విడదీయలేని,వేరు చేయలేని బంధం కలిగిన వాటిని గురించి చెప్పే న్యాయమే అవినాభావ సంబంధ న్యాయము.
సముద్రానికి ఎగిసిపడే అలలకు, అందులోని ఉప్పు నీళ్ళకు అవినాభావ సంబంధం ఉంది.వాటిని విడదీసి చూడలేం.
అలాగే కుండనూ మట్టినీ,నిప్పునూ వేడినీ,నింగినీ మబ్బులనూ, ఆకాశం నక్షత్రాలనూ, పూవునూ పరిమళాన్ని, వస్త్రాన్ని అందులోని దారపు పోగులను వేరు చేసి చూడలేము.ఇవన్నీ విడిపోని బంధాలు .
అలా ఒకదానికొకటి వేరు చేయలేని ,విడదీయలేని బంధమే అవినాభావ సంబంధం.
మన మనసుకు కూడా ఇలాంటి న్యాయమే వర్తిస్తుంది.నిరంతరం వచ్చే ఆలోచనలనూ, అంతులేని కోరికలనూ మనసు నుండి వేరు చేయలేము.
అలాగే మంచితనం కలిగిన వ్యక్తులు ఎన్ని సార్లు మోసపోయినా వారిలోని మానవతా విలువలను విడువరు.
కాబట్టి మనసుకూ మనిషిలోని ఆలోచనలు కోరికలకూ; మంచితనానికి మానవతా విలువలకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుందని ఉదాహరణగా చెప్పవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి