మూడు కప్పలు ఓ పర్వతాన్ని ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాయి.
అవి పర్వతాన్నెక్కే సమయంలో అక్కడ ప్రేక్షకుడిగా ఒకడున్నాడు.
ఇంత ఎత్తయిన ఈ పర్వతాన్ని ఎక్కేటప్పుడు దారిలో ఎక్కడైనా రాళ్ళు అడ్డొస్తే కిందపడితే అంతేసంగతులు అన్నాడా ప్రేక్షకుడు.
వెంటనే ఓ కప్ప పర్వతాన్ని ఎక్కే ప్రయత్నాన్ని విరమించుకుంది.
కొంత దూరం వెళ్ళిన రెండు కప్పలను చూసిన ఇంకొకడు"పైకెళ్ళేటప్పుడు పాములు గానీ మిమ్మల్ని పట్టుకుంటే ఏం చేస్తారు?" అని అన్నాడు.
వెంటనే రెండో కప్ప కిందకు దిగిపోయింది.
కానీ ఎవరేం చెప్పినా పట్టించుకోని మూడో కప్ప మాత్రం శిఖరాగ్రానికి చేరుకుంది ధరహాసంతో.
అనంతరం కిందకు దిగిన మూడో కప్పతో అక్కడున్న ఒకడు "నువ్వు మాత్రం ఎవరెన్ని చెప్పినా శిఖరాగ్రానికి వెళ్ళొచ్చావు. ఎలా?" అని అడిగాడు.
అతను అడిగిన విషయాన్ని అర్థం చేసుకున్న ఆ కప్ప తన చెవులు పని చేయవు అంది.
మనమూ జీవితంలో ఈ మూడో కప్పలాగా కొన్ని సమయాలలో చెవిటివానిలా ఉంటేనే పురోగమించి జీవితంలో కొన్నింటిని అధిగమించగలం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి