"పొత్తమెంతొ ఘనము విత్తము కన్నను
తెరచిమస్తకంబు తెలివిపెంచు
నొంటరవడు మనిషి వెంటున్న పొత్తము
హితునికన్న హెచ్చు హితముగూర్చు" అంటూ
తెలుగుభాషపట్ల అభిమానంతో కవులు,కవయిత్రులు,రచయితలు,రచయిత్రులు మంచి విషయపరిజ్ఞానముతో, శ్రమదమాదులకోర్చి,వేలకువేలు ఖర్చుచేసి మంచి మంచి విషయములువ్రాసి పుస్తకాలను వందల వేలాదిగా ఆవిష్కరింపచేస్తున్నారు.చాలా సంతోషకరమైన విషయమిది.
తెలుగుభాష కనుమరుగైపోతోందన్న ఆవేదనతో తెలుగుభాషాభిమానులు తల్లడిల్లిపోతున్నా,
"తెలుగునెవ్వడురా
తీసివేయువాడు
పరభాష వెర్రితో పలుకుగాని"అని, తెలుగుభాష ఏనాటికీ మరుగు పడదనే ధీమాతో, యీనాటి వారికేకుండా,రాబోయే తరముకొరకుకూడా
'మంచి పుస్తకాలు చదవాలి ,చదివింపజేయాలనే' తపనతో కవులూ,కవయిత్రులూ,రచయితలూ,రచయిత్రులూ మనసుపెట్టి తమ రచనలను ముద్రించి,పుస్తకాలుగా ఆవిష్కరింపచేస్తున్నారు.ఒకరకంగా వీరంతా తెలుగు భాషకు తెలుగువారిగా సేవచేస్తున్నారు. అక్షరాస్యులమైన మనమందరం ప్రచురించబడే అసంఖ్యాకమైన పుస్తకాలలో కనీసం ఒకటిరెండు కొని చదివినా,అరువుతెచ్చుకు చదివినా, రచయితలపట్ల
కృతజ్ఞతాంజలులు సమర్పించుకొన్నట్లే.తెలుగుభాషకు సేవచేసినట్లే. .

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి