ఈ అక్షర గేయం;--గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు.
ఈ ర్ష్యగుణమే జాడ్యము
ఈ గల వలన రోగము
ఈ త మంచి వ్యాయామము
ఈ కలు పక్షికవసరము

ఈ లపాట  గంభీరము
ఈ త పండ్లు మాధుర్యము
ఈ సృష్టిలో బాల్యము 
ఈ శ్వరుని బహుమానము

ఈ నాడు రైతు పరిస్థితి
ఈ తి  బాధల్లా ఘోరము
ఈ సడింపు దుర్గుణము
ఈ డుజోడే  సుందరము

ఈ దర గాలులు భీకరము
ఈ టె యుద్ధ పరికరము
ఈ  శాన్యము ఒక దిక్కు
ఈ డేరు సత్సంకల్పము


కామెంట్‌లు