నిర్మల సరస్సులో
కలువై ప్రభవించిన
జ్ఞాన ఋషి
ఆ జ్ఞానమే అమరమై
ఆ బోధనే తేజమై
అతని ముందు మోకరిల్లింది
తన మేధస్సును
స్వేచ్ఛ
విహంగాన్ని చేసి
గగనవీధీలో ఎగరవేసిన
త్యాగ పురుషుడు
ఆ వాగ్దాటి ఎందరికో
ప్రేరణ ఇస్తూనే ఉంది
ఆ వికాస శీలత
ఇంకెందరికో
స్ఫూర్తినిస్తూనే ఉంది
ఆ స్పురధృపం
దైవమై దర్శనమిస్తూనే
ఉంది
ఆ తత్వం అమృత తత్వమై విరాజిల్లుతూనే ఉంది
ఆ సత్యా అన్వేషణలు
దిశా నిర్దేశం చేస్తూనే
ఉన్నాయి
భారత ఖ్యాతిని
ఉన్నతంగా
నిలిపిన
ఆ తొలి శిఖరం
జయ కేతనమై
రెపరెపలాడుతుంది
ఆ దయార్థ హృదయం
బడుగు జీవులను
ఓదార్చుతూనే ఉంది
ఆ జ్ఞాన తృష్ణ
భావివివేకమై
మార్గదర్శ గమనాన్ని
చేర్చుతుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి