పిల్లలు ప్రశ్నిస్తే....
పెద్దలు చిరాకు పడరాదు !
పిల్లలలోని ఆసక్తి నెపుడు...
అణచి వేయరాదు..!!
ఎదుగుతున్నవయసులువారివి
వికసిస్తున్న మేధస్సులవి... !
పెద్దలు ప్రోత్సహిస్తే పిల్లలు...
పిడుగులె యౌతారు !!
వారు తెలిసీ - తెలియక...
తికమక పడితే....
తప్పొప్పులు సరిదిద్దాలి
సహనముతొ ప్రవర్తించాలి !
ఇష్టములేనిచదువు చదవమని
బల వంత పెట్టరాదు... !
ఏది ఎందుకో బోధ పరచి
మన దారికి తేవాలి !!
వారి అభిరుచులను గమనించి
మనము అభినందించాలి
వారి కృషి - పట్టుదలలకు
ఎపుడూ సహకరించాలి !
ఎదగ గలరు గొప్పవారిగా
అప్పుడే... వారు !
కన్నవారికి, సొంతఊరికి
...మంచిపేరును తేగలరు!!
పిల్లలు ప్రశ్నిస్తే...
పెద్దలు చిరాకు పడరాదు !
పిల్లలలోని ఆసక్తి నెపుడు
అణచి వేయ రాదు... !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి