*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 054*
 కందం:
*సద్గోష్ఠి సిరియు నొసగును*
*సద్గోష్ఠియె కీర్తి బెంచు సంతుష్ఠిని నా*
*సద్గోష్ఠియె యొనగూర్చును*
*సద్గోష్ఠియె పాపములను జంపు కుమారా !*
తా:
కుమారా! మంచి మనసు, ఉత్తమమైన ఆలోచనలు, మరింత ఉత్కృష్ట మైన పనులు చేసేవారితో, చేసే స్నేహము సద్గోష్ఠి అవుతుంది. ఈ మంచి వారితో చేసిన సంభాషణ మంచి ఫలితాలను, చక్కని పేరు ప్రతిష్ఠలు తెచ్చి పెడుతుంది. సంపదలను కూడా ఇస్తుంది. ఆ సత్పురుషుల ప్రభావం వలన మన పాపాలు కూడా పోతాయి........... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*మంచి వారి సహవాసం వల్ల కలిగే లాభం గురించి మనకు తెలియజేయడానికి, ద్వాపరంలో కృష్ణ పాండవులు స్నేహం, రామ సుగ్రీవుల స్నేహం కనిపిస్తాయి. మంచి మనసులతో కలిసి ఉండటం అనేది ఒక భాగ్యం. ఇంకా చెప్పాలంటే ఒక భోగం. ఎందుకంటే, సత్సాంగత్యంబలో ఉండటం అంటే, పరమాత్మునితో ఉండడమే. అంతటి సద్భాగ్యాన్ని మనకు కలిగించమని....... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు