కందం:
*జారులతో ఁజోరులతోఁ*
*గ్రూరులతో నెపుడుపొత్తు ఁగోరక మది స*
*త్పూరుష పదాంబు జాతా*
*ధారుడవై బ్రతుకు కీర్తి తనరు కుమారా !*
తా:
కుమారా! విటులు, దొంగలు, దుర్మార్గులు అయిన వాళ్ళతో ఎప్పుడూ స్నేహం చేయకు. నీ మనసులో ఎల్లప్పుడూ మంచివారి, భగవంతుని భక్తుల యొక్క పాదలను సేవించడం అనే మంచి ఆలోచనను ఉంచుకుని జీవనం చేస్తే, నీకు మంచి పేరు వస్తుంది........... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*ఈ భూమి మీద మనల్ని తప్పు దారిలో నడిపించడానికి ఎన్నెన్నో ఆకర్షణలు సిద్ధంగా ఉన్నాయి. ఒక వేళ, అవి, మన కంటికి కనబడక పోతే, కనిపించేలా చేయడానికి మన స్నేహితులుగా అనిపిస్తూ, మన పక్కన ఉండేవారు చాలామంది, కాచుకుని ఉన్నారు/ఉంటారు. ఇటువంటి వారి వల్ల గానీ, తప్పు దారిలో వెళ్ళడం వల్ల గానీ, మనకు ఈ భూమి మీద ప్రయాణానికీ ఉపయోగ పడదు, పరలోక ప్రయాణానికీ ఉపయోగ పడదు. కాబట్టి, ప్రయత్నం చేసి మరీ ఈ దారులకు దూరంగా ఉండాలి. మరి మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి మనకు ఉన్న ఉత్తమమైన మార్గం, మంచి వారితో స్నేహం చేయడం, సాధుజనులు, సద్గురువుల పాదాలు పట్టుకుని ఉత్తమ ఆలోచనల కోసం, ఉత్తమమైన గతులు కలగడానికి ప్రార్థన చేయడం. మంచి ఆలోచనలతో ఉండేవారి స్నేహం వల్లనే మనలో ఉండే చెడు ఆలోచనలు దూరం అవగలుగుతాయి. కనుక, ఇహానికి, పరానికి ఉపకరించే మంచి స్నేహాలను కలుపుకుంటూ, సద్గురు చరణాలను సేవిస్తూ ఉండే సదవకాశాన్ని మనకు కలిగించమని...... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి