కందం:
*పెరవారలుండ ఫలముల*
*నరయంగా వారికిడక యాతడెమెసవన్*
*సరిగాదు విసవు మేతకు*
*సరియౌనని తలపు మానసమున కుమారా !*
తా:
కుమారా! అలోచించి చూస్తే, మన మానవ సమాజంలో, మన దగ్గర పండ్లు ఉండి, మన చుట్టూ ఉన్నవారితో ఆ పండ్లను పంచుకోకుండా, మనము మాత్రమే తినడం సరియైన పద్దతి కాదు. అలా మనం ఒక్కరమే తినడం అనేది విషము తో సమానముగా చూడబడుతుంది......... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*మనం నలుగురిలో, నలుగురితో ఉన్నాము అనే సోయి, ఊహ మనసులో ఉంచుకుని ఉండడం మనకు మనచుట్టూ ఉన్న వారికి కూడా మంచి చేస్తుంది. మనకు వున్నది, మన అనుకునే వారితో అయినా, ఎవరో, పరిచయం లేనివారితో అయినా పంచుకోగలిగితే చాలా అనందం కలుగుతుంది. మనసు సంతోషంతో తెలియాడుతుంది. మన దగ్గర చాలా తక్కువ విలువ చేసే, విరివిగా దొరికే పటికబెల్లమే ఉన్నా, చిన్న బాస్కెట్ ముక్క అయినా, మన పక్కన ఉన్న వారితో పంచుకోవాలి అనే ఆలోచన రావడం చాలా అవసరం. మన దగ్గర ఉన్నది ఏదైనా, మనకే కాదు పదిమందికీ చెందుతుంది అని ఒప్పుకుని, నలుగురినీ కలుపుకుని, నలుగురితో పంచుకుంటూ, ఆనందంగా జీవించే సదవకాశాన్ని, సద్బుద్ధిని ఈయమని....... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి