కందం:
*అల సరసాన్నంబుల బరి*
*మళము గలుగు వస్తువులను మహితల యానం*
*బుల నాసనముల నుబ్బకు*
*కలుగం జనుకాలవశముగాను కుమారా !*
తా:
కుమారా! ఈ భూమి మీద సమాయానుకూలంగా మనకు లభిఙచిన యోగ్యమైన భోజనము, మంచి సువాసన ద్రవ్యము, వస్తవులు, వాహనముకు, కుర్చీలు మొదలగయ వాటిని చూసుకుని అనవసరంగా గర్వ పడవద్దు. ఇవన్నీ ఎలా వచ్చాయో, అలాగే వెళ్ళే సమయం వచ్చినప్పుడు వెళ్ళి పోతాయి............ అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*ఈ ప్రపంచంలో పూర్వ జన్మ పుణ్యం వలన కానీ, అదృష్టం కలసి వచ్చి కానీ, మనకు దొరికే సుఖాలు, సంతోషాలు అన్నీ కూడా, అవి దొరికిన క్షణం వరకు మాత్రమే మనతో ఉంటాయి. ఈ సుఖాలు, దుఃఖాలు మన జీవిత కాలం మనతో ఉండవు. మళ్ళీ ఇంకొక సందర్భంలో, వేరొక సంతోషకరమైన విషయం లేదా దుఃఖకారణమైన విషయం మనకు తారస పడతాయి. అందువలన, మనకు కలిగిన సంపదలు, సమాజంలో దొరికిన మంచి గుర్తింపు, మన దగ్గర ఉన్న కార్లు, స్కూటర్లు, బంగారు నగలు, శాస్వతము కాని వీటిని చూచి, మనం గర్వంతో విర్రవీగ కూడదు. ఎందుకంటే, ఇవి అన్నీ కూడా ఏక్షణాన్నైనా మనల్ని వదలి వేరొకరి దగ్గరకు వెళ్ళి పోతాయి. "లక్షి లేదా అదృష్టం చంచల కదా!". అందుకని, మనకు ఉన్న దాంట్లో కొంతైనా ఎదుటివారితో పంచుకునే మంచి లక్షణాలను మనకు అనుగ్రహించాలని ...... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి