*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 070*
 కందం:
*ప్రజ్ఞావంతుని చేతను*
*ప్రజ్ఞాహీనునకు గడమ వాటిల్లు నిలన్*
*బ్రాజ్ఞత గల్గి నటించిన*
*దత్ జ్ఞున్నుతియిందుతరియే ధనము కుమారా !*
తా:
కుమారా! ఈ భూమి మీద తెలివిగల వారి వల్లనైనా, తెలివిలేని మూర్ఖుల వల్ల గానీ చివరికి కష్టము గానీ, నష్టము గానీ జరుగుతుంది. తెలివితేటలు ఉండి కూడా సమయానుకూలంగా నడుచుకునే తెలివైన వారిని అందరూ మెచ్చుకుంటారు. అలా వచ్చిన మెప్పే, ఆ తెలివితేటలు కలిగిన వ్యక్తికి ధనముతో సమానము............ అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*"ఎప్పటి కెయ్యది ప్రస్తుత! మప్పటి కా మాటలాడి అన్యుల మనముల్ !! నొప్పింపక తానొవ్వక !!! తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ" అని వేములవాడ భీమ కవి లేదా భద్రభూపాలుడు లేక బద్దెన లేదా సుమతి అనే పేరుతో జైన భిక్షుడు 18వ శతాబ్దం రెండవ భాగంలోనే చెప్పిన నిజాన్ని పక్కి లక్ష్మీ నృసింహ కవి మళ్ళీ చెప్పారు. తెలివితేటలు ఉన్నంత మాత్రాన, మనం జీవితాన్ని గెలవలేము అనేది కవి భావం. "చాకచక్యంగా మెలగడం" అని ఒక వాడుక పదం మనం వంటాము. దీని అర్థం, మనం ఎదుటి వారికి లొంగిపోవడం కాదు. నిజాన్ని నమ్ముతూ, నిజంతోనే ఉంటూ, ఆ నిజాన్ని స్థిరీకరించే సమయంలో ఎవరినీ ఇబ్బందికి గురి చేయకుండా ఉండటం, మనకు ఇబ్బంది కలగకుండా మసలు కోవడం మన బాధ్యత. ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా, మనం నిజం తో ఉండే పరిస్థితిని మనకు కలిగించమని.... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు