జరుక్ అన్న పేరుతో ప్రసిద్ధమైన జల సూత్రం రుక్మిణీ నాథ శాస్త్రి గారు విశ్వనాథ సత్యనారాయణ గారికి అత్యంత ప్రియ మిత్రుడు ఒకరిని ఒకరు ఎప్పుడు వచ్చినా ఏక వచన ప్రయోగమే చేసుకుంటూ ఉంటారు. విశ్వనాథ సత్యనారాయణ గారికి ఏదైనా అనుమానం వచ్చినప్పుడు శాస్త్రి గారిని అడగడం అలవాటు వీరు తెలుగు సంస్కృత భాషలనే కాక బుద్ధుని జీవిత ఆశయాలను అధ్యయనం చేయడం కోసం పాళీ భాషను నేర్చుకొని వ్యాఖ్యానం చేసిన పండితులు అనేక పుస్తకాలు రాశారు వారు విజయవాడ కేంద్రానికి వచ్చిన తరువాత సూక్తి ముక్తావళి కార్యక్రమాల్లో త్రి పిటకములలో వాళ్ళ సూక్తులను తీసుకొని దానికి వ్యాఖ్యానం చేసే పద్ధతి ప్రవేశపెట్టారు. వారు ఏదైనా కార్యక్రమాలు చేసినప్పుడు దానికి వంకలు పెట్టే అవకాశం ఎవరికీ రాదు. విశ్వనాథ్ వారి ఆలోచనలలో ఏదైనా వక్ర మార్గం కనిపిస్తే దానిని సరి చేయగలిగిన ఒకే ఒక వ్యక్తిశాస్త్రి గారు శాస్త్రి గారికి వచ్చిన ఏదైనా కొత్త ఆలోచనను శ్రోతలకు అందించాలనుకుంటే విశ్వనాథ వారిని పిలిచి వారి ద్వారా చెప్పించే అలవాటు అలా అనేక కార్యక్రమాలు విశ్వనాథ వారితో చేయించారు అమ్మవారి భక్తుడు అమ్మవారి గురించి మూడు గంటల నాటకం రాస్తే వెంపటి రాధాకృష్ణ ఆకాశవాణి అనౌన్సర్ ఆ నాటకాన్ని వేదికపై ప్రదర్శించారు శాస్త్రి గారిని పేరడీ శాస్త్రి అని పిలుస్తారు. గొప్ప గొప్ప కవితలు రాసిన వారి కవితలను కూడా తన ప్యారడీ ద్వారా చురకలు వేయడంలో అందవేసిన చేయి. అలా చేసి వారి లోపాలను తెలియజేయడం ఆయన ఉద్దేశం ఉభయ కుశలోపలి కార్యక్రమం దగ్గర నుంచి అనేక కార్యక్రమాలను నిర్దేశించిన వారు శాస్త్రి గారు
మరుగుపడిన పుస్తకాలను వెలికి తీసి వాటిని ముద్రించి రూపాయికి ఒక పుస్తకం అమ్మెలా ఆంధ్ర ప్రదేశ్ తెలుగు అకాడమీ వారు ఏర్పాటు చేశారు అది ఒక పుస్తకం తీసుకుంటే నీకు 10-15 నా దగ్గర ఉన్నాయి ఇస్తాను అని జరుక్ గారు చెప్పడం ప్రతి నెల ఒక పుస్తకం ఇచ్చి 17 పుస్తకాలు తెచ్చుకోవడం నాకు అలవాటు అయింది. శాస్త్రి గారికి కూడా వారి అబ్బాయి ప్రసాద్ అసలు తెలివి లేని వాడు శాస్త్రి గారి మీద అభిమానంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు వాడిని పిలిచి గుమస్తా ఉద్యోగం ఇచ్చారు వాడి నాన్నగారు రాసిన పుస్తకాల సారాంశం వాడికి తెలియకపోవచ్చు కనీసం నాన్న ఎన్ని పుస్తకాలు వ్రాశారు వాటి పేర్లు కూడా వాడికి తెలియదు చిన్న వయసులోనే వాడు మరణించడం శాస్త్రి గారికి తీరని వ్యధను మిగిల్చింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి