ఆకాశవాణిలో ఏ కార్యక్రమం ఏర్పాటు చేసిన వీరు లేకుండా జరగదు. రజినీ గారు సంచాలకుడిగా ఉన్న రోజులలో అంత క్రితం మద్రాస్ నుంచి విడుదల అయ్యే వాణి రేడియోకు సంబంధించిన కార్యక్రమాలను చెప్పే మాసపత్రిక విజయవాడ నుంచి తెలుగు కేంద్రాల కార్యక్రమాలను శ్రోతలకు అందించాలన్న అభిప్రాయంతో విజయవాడలో ఆ పత్రికను ప్రారంభించిన సందర్భంగా ప్రధాన అతిథిగా గౌరవ్య విశ్వనాథ వారు వచ్చారు అందరి ఉపన్యాసాలు అయిపోయిన తర్వాత రజనీ గారు మాట్లాడుతూ ఇంతవరకు రైల్వే శాఖ వారు మాత్రమే వారి కార్యక్రమాలను తెలియజేస్తూ టైం టేబుల్ పేరుతో వారి పత్రికను వారు ఏర్పాటు చేసుకున్నారు తర్వాత ఆంధ్రదేశంలో రేడియోకి ప్రత్యేకించి ఆంధ్రులకు కావలసిన వివరాలను అందించే పక్ష పత్రికను మనం ప్రారంభిస్తున్నాం.
ఇది ప్రతి ఒక్కరూ సంతోషించ తగిన సందర్భం ప్రత్యేకించి మా కార్యక్రమాలు ఏవి ఏ రోజున ఎన్ని గంటలకు ప్రసారం అవుతాయో అన్నిటి వివరాలను ఇస్తున్నాం నాటకాలలో ఉన్న నటులు నటించిన చిత్రాలను వారి పేర్లను కూడా ప్రచురిస్తాం. ఏ సమయంలో ఏ సినిమా పాట వేస్తున్నాము ఏ పాట వేస్తున్నాము కూడా శ్రోతలకు తెలిసేలా ముందే తెలియజేస్తాం ఇక్కడ ఒక విషయం గమనించాలి రైల్వే వాళ్లు ప్రచురించిన పుస్తకంలో వారు చెప్పిన ఏ సమయానికి ఏ రైలు రాదు. కానీ రేడియోలో ఏ సమయంలో ఏ కార్యక్రమం వస్తుందో ఆ క్షణాన్ని దాటి ఆ కార్యక్రమం తప్ప మరొకటి రాదు. రేడియోకి, రైల్వే కి ఉన్న భేదం అది అనేసరికి విశ్వనాథ సత్యనారాయణ గారితో సహా కరతాళ ధ్వనులతో ఆహా అంటూ వచ్చిన ప్రతి ప్రేక్షకులు ఆనందించారు అలాంటి సందర్భాలు అనేకం.
విశ్వనాథ వారు చెప్పిన విషయాలను జాగ్రత్తగా వింటున్న భరత శర్మ గారు దేశం మొత్తం మీద ఆంధ్ర భాషా ప్రాశస్త్యాన్ని మిగిలిన భాషల వారికి తెలియజేసిన మీ ప్రజ్ఞకు జోహార్లు పద్మశ్రీలో నుంచి జ్ఞానపీఠ బహుమతులు మీ ప్రతిభ ముందు బలాదూర్ అన్నప్పుడు అరేయ్ శాస్త్రి నాదేముందిరా నాకు అక్షర బిక్ష పెట్టిన గురువర్యులు తిరుపతి వెంకట కవుల ఆశీస్సులతో పెరిగినవాడిని నేను ఏ ఒక్క అక్షరంతో ప్రయోగం చేసినా దాని కీర్తి గురువులకే దక్కుతుంది తప్ప నాకు కాదు అంటూ ఎంతో వినయంగా మనసులో వారిని స్మరించుకుంటూ నమస్సులు అర్పించారు. అలాంటి వినయ శీలి ఆంధ్రుడుగా జన్మించి మనం ఏమిటో ప్రపంచానికి తెలియచేసిన విశ్వనాథ సత్యనారాయణ గారి జీవితం ధన్యం వారికి వారే సాటి మరొక ఉదాహరణను మనం చెప్పలేము.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి