అప్పటినుంచి దాదాపు దశాబ్ది కాలం సినిమా జీవితం సాగింది సారంగధర కాలచక్రం జెమినీ వారి బాలనాగమ్మ చిత్రాలలో నాయక పాత్ర పాదుకలో భరతుని పాత్ర నిర్వహించారు 1942లో భార్యా కోసం సంభవించడం వల్ల సినిమా అవతరణ రచించినందున చిత్ర ప్రపంచం నుంచి వైదొలిగారు. ఏలూరు కు తిరిగి వచ్చి వివాహం చేసుకున్నారు సతీమణి పేరు శ్రీమతి కనకదుర్గమ్మ గారు. ఆమె అడుగు పెట్టిన వేళా విశేషం బందా గారికి కనకవర్షం కురియ సాగింది ప్రభాత్ థియేటర్స్ స్థాపించి కార్యకలాపాలను తీవ్రతరం చేశారు. స్నేహితుడు ఊటుకూరు సత్యనారాయణరావు జంపని చంద్రశేఖర రావు, వెంకట్రావు గారితో రంగస్థలానికి అనుకూలంగా పెక్కు నాటకాలు వ్రాయించుకొని ప్రదర్శించారు యుద్ధ కాలంలో నాటకాల వల్ల లక్షలు సంపాదించారు పిల్వ మంగళ పాత్రలో సరికొత్తగా నటించారు. ఆ నాటక సమాజాన్ని ఇరవై ఐదు ఏళ్ల పాటు ఎంతో వచ్చాక చాకచక్యంగా నడిపారు.
1965 వ సంవత్సరంలో రష్యా దేశాన్ని సందర్శించారు అక్కడి నాటక రంగాలను పరిశీలించి స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యులు గాను డ్రామా స్కాలర్షిప్ కమిటీ ఎక్స్పర్ట్స్ గానూ ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ కార్యవర్గ సభ్యుడు గాను నియమితులయ్యారు. బందా గారు అనేక వేషాలు వేశారు బహుళ ప్రచారం పొందిన కృష్ణుని పాత్రతోపాటు బాహుబలుడు, శ్రీనివాసుడు కర్ణుడు కణ్వ మహర్షి రాముడు, అభిమన్యుడు సారంగధరుడు గిరీశం సలీం రఘునాథ్ అల్లూరి సీతారామరాజు రామశాస్త్రి ఇంకా ఇంకా ఎన్నో వాటికి సాక్షిగా గవర్నర్లు మహారాజులు ఇచ్చిన ఎక్కువ సువర్ణ పథకాలు రజిత పాత్రలు బిరుదులు ఉన్నాయి కురుపాం రాజావారు బందాగారిని నటశేఖరా అని సంబోధించారు కానీ వారి అభిమాన పాత్రలు బహుకుడు అన్ని పాత్రలు నాకు ఇష్టమే. ఇష్టం లేనిదే ఏ వేషము నేను వేయను. రౌడీ వేషాలు వేలన్ వేషాలు వేయడం నావల్ల కాదు అయితే మీరు పిల్వమంగళ వేషం వేసినప్పుడు గుత్తి వంకాయ కూర పాట పాడారు. కర్నూలు ప్రదర్శనలోనూ, కృష్ణుని వేషం లోనూ పాడారే మీరు కూడా ప్రేక్షకులలో చెడ్డ అభిరుచిని పెంచారా అని ప్రశ్నించినప్పుడు దానికి నేకేమీ జవాబు దొరకదు. జనం, వేలం, వెర్రి ఆ రోజులలో ప్రేక్షకులు కోరినవి పడకపోతే వారికి నచ్చిన పాట విని ఒన్స్ మోర్ అన్నప్పుడు తిరిగి పాడకపోతే మా మీద రాళ్లు పడతాయి కొన్ని సందర్భాల్లో జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఆ స్థితి నన్ను కూడా తెచ్చుకోమంటారా అని ఎదురు ప్రశ్న వేస్తారు బందా గారు. ఏది ఏమైనా వారి నటనా జీవితమంతా ఒక ఎత్తు కూచిపూడి నాట్య సంప్రదాయ సముధరణ ఒక ఎత్తు. కళాక్షేత్రం అనే పేరుతో కూచిపూడి నాట్య పాఠశాల స్థాపించి చేసిన కృషి కూచిపూడి నాట్య బృందాన్ని యావత్ భారతదేశంలోనూ తిప్పుతూ చేస్తున్న ప్రచారం సాటిలేనిది ఐదేళ్ల వరకు కూచిపూడి వారికి డబ్బిచ్చి ఆ సంప్రదాయంలో బాగా శిక్షణ ఇచ్చారు వారు ఇప్పుడు బాగా నేర్చుకున్నారు కష్టపడి ముష్టి సంపాదించిన రెండు లక్షల రూపాయలు ఇతరుల సహాయంతోను కూచిపూడిలో సిద్ధేంద్ర కళాక్షేత్రం కట్టించారు అని వారు దీని వల్ల వచ్చే జన్మ తరించినట్లుగా నిండుగా హాయిగా ఆనందంగా చూడనిస్తారు గతమైన సత్కార్యం చేసే వారికి ఎవరికైనా ఆ సంతుష్టి ఆ నిండుతనం, సంతృప్తి ఉంటాయి జీవితమంతా నాటకానికి పణంగా ఉండి ఎవరికి తలవంచక తను తల ఎత్తుకొని తమ అభిమానించిన కీర్తి ప్రతిష్ట చేకూర్చుకున్న శుద్ధ సంకల్పులైన బందా గారు సితేంద్ర కళాక్షేత్రాన్ని యావత్ భారత దేశానికే కాక ప్రపంచానికే మహత్తర కళా తీర్థంగా రూపొందించారు అనడం సముచితం.
నటనకు వ్యాకరణం బందా గారు (43) - ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం949281132-2.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి