చాలా గ్రామాలలో మూఢ నమ్మకాలకు ఎక్కువ ప్రాధాన్యతాను ఇస్తూ ఉంటాడు నిజాయితీగా గ్రామం మొత్తం ఒకే కుటుంబం గా ఉంటూ అక్కడ ఎవరు పేరు పెట్టి పిలుచుకోరు అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, బాబాయ్, మామయ్య లాంటి వరసలతోనే పిలుచుకుంటూ ఉంటారు. సామాన్యంగా ఎలాంటి తప్పులు జరగడానికి ఆస్కారం ఉండదు ఒకవేళ పొరపాటుగా ఏదైనా జరిగి ఉంటే ఆ గ్రామ పెద్ద రచ్చబండ దగ్గర కూర్చుని గ్రామంలో పెద్దలను పిలిచి వారి ఎదురుగా చర్చించి ఎవరిది తప్పు నిర్ణయించి వారికి శిక్ష వేయడం ఆనవాయితీ అలాంటి గ్రామంలో రెడ్డి జన్మించారు చిన్నతనం నుంచి చదువు మీద ఉన్న శ్రద్ధ మిగిలిన వాటి మీద లేదు చదువు మీద దృష్టి పెట్టి ఎం కామ్ అత్యధిక మార్కులతో మొదటి తరగతి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. చరిత్రకాని, గ్రామీణ పద్ధతిని గాని చెప్పినప్పుడు వినే వారి కొంచెం హాస్యంగా ఉంటుంది కానీ అనుభవించిన వాడికి ఆ బాధ తెలుస్తుంది సామాన్యంగా రైతు కుటుంబాలలో ఉడ్పు జరుగుతున్న సమయంలో చిన్నపిల్లలను అంటే పది పదిహేను సంవత్సరాల లోపు వారిని నారు కట్టలను అందించడానికి ఏర్పాటు చేసుకుంటారు. మోకాలు లోతు బురదలో కాలు తీసి కాలు వేయడానికి వీలులేని పరిస్థితిలో స్త్రీలు ఏకంగా ఒక్కొక్క వరసలో నాటుకుంటూ వస్తూ ఉంటారు ఈ కుర్రవాడు వెనక్కు నడుచుకుంటూ చేతిలో ఉన్న ఆ నారు కట్టడు ఎవరి చేతిలో అయిపోవడానికి సిద్ధంగా ఉందో అది గమనించి వారికి అందేలా విసరాలి. ఇతను పడుతూ లేస్తూ చేస్తున్న పనిని గట్టుమీద ఉండి చూస్తూ ఉంటే మనకు నవ్వు వస్తుంది. కానీ చేలో వాడికి ఆ పనిని చేస్తే ఎన్నిసార్లు పడిపోతారో వాళ్లకు తెలుస్తుంది.
అలాగే వర్షాకాలంలో జారుకుంటూ గట్ల పైన నడుస్తూ వెళుతున్నప్పుడు రేగడి నేలలో కాలు జారి పడిపోతే చూసేవాడికి నవ్వు వస్తుంది అయ్యో పాపం అంటూ జారి పడ్డ అతనిని లేవదీయడానికి బదులు ఎక్కడ నవ్వుతూ కూర్చుంటూ ఉంటాడు. అదే తాను ముందుకు వెళ్లి పడిపోయినప్పుడు ఎదుటివారు నవ్వితే వీడి మనసు ఎలా ఉంటుంది ఆ క్షణాన్ని ఊహించుకొని ఆ క్రితం క్షణంలో తను చేసిన పనిని గుర్తు చేసుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి సిగ్గుతో తల ఉంచుకోవాలో మానసికంగా తాను చేసిన తప్పుకు బాధపడాలో తెలుస్తుంది అదే ఆడపిల్లలకు జరిగితే తన చెల్లికో, అక్కకో అలా అయినప్పుడు తను ఏం చేస్తాడు వెంటనే వచ్చి లేపడానికి ప్రయత్నం చేయడా అవతలి వారి పట్ల ఎందుకు అంత సంకుచితంగా ఆలోచించడం అది మానవ సహజ లక్షణం అని సరి పెట్టుకోవాలనుకుంటామా.
ఉత్తమ రైతు- శ్రీ కోటి రెడ్డి (5);- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి