హాస్యనటుడు బ్రహ్మానందం పుట్టినరోజు-పద్యాంజలి"!!!;- "సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్-- చరవాణి:- 6300474467
 01.
తే.గీ.
కన్నెగంటివంశంబునవన్నెలీని
హాస్యనటనతోనటియించిహాస్యరసము
ప్రేక్షకాళికియందించిపేరుగాంచి
తెలుగుచిత్రరంగంబులోతేజరిల్లె!!!

02.
తే.గీ.
చిత్రములలోవిచిత్రపుపాత్రలందు
అభినయించుచునవ్వులనందజేసి
మాటలోచమక్కులనెన్నొమీటుమనసు
భువికళామతల్లికితానుముద్దుసుతుడు!!!

03.
తే.గీ.
బ్రహ్మదేవునిమాదిరిపాత్రసృష్టి
అద్భుతంబుగజేసియునలరుచుండు
ఆపుకోలేనినవ్వులనతడునొసగు
సాటిలేరయ్యనీకునుసద్గుణాఢ్య!!!
04.
కం.
బ్రహ్మానందంహాస్యము
బ్రహ్మానందంబుగొల్పుపలువిధములుగన్
బ్రహ్మానందంచిత్రాల్
బ్రహ్మానందంబుగూర్చుప్రజలకునెపుడున్!!!

05.
కం.
కడుపుబ్బానవ్వించుచు!
కడుపాఱడిప్రేమపంచి,గమ్మత్తులతో
గడగడలాడించునుసరి
వడిగాతనహావభావపాత్రలచేతన్!!!




కామెంట్‌లు