తే.గీ
తులసి వనమందు పసికందు ఫలము గాను
గాన వచ్చెనే బంగారు కల్ప వల్లి
విష్ణు చిత్తుండు మురిపాన పెంచుచుండ
నెదుగు చుండెను కృష్ణున్ని యెదన నిలిపి
తే.గీ
తండ్రి వాసుకై కూర్చిన దండ నెపుడు
ముందు ధరియించి యద్దాన మురిసె చూసి
వేసివిడిచిన మాలను వాసుమెడన
వేసి నుప్పొంగె నెరుగక విష్ణు చితుడు
తే.గీ
గోదచుట్టున్న నెయ్యాలు గోపికలని
తలచి కృష్ణున్ని ప్రియముగన్ వలచుచుండె
నమ్మకముతోడ కాత్యాయినమ్మ యనుచు
చెలులతో గోద వ్రతమును చేయబూనె
తే.గీ
మాస మారంబమందుండి మంగళముగ
భక్తితో ధనుర్మాసాన వ్రతముబట్టి
మాస మంతయున్ ప్రతిరోజు చేసి పిదప
పాడి వినిపించె శ్రీ కృష్ణ పాశురమును
తే.గీ
ఇట్లు ముప్పది దినములన్ యిష్టముగను
కృష్ణ గీతాలు పాడెను తృష్ణ తోడ
పాడినట్టి యీ గీతాలు పదిలముగను
పాశురములుగన్ పేరొంది వాసికెక్కెఁ
తే.గీ
గొప్ప భక్తుండు వేణుకు గోద తండ్రి
నిత్యమానంద మాలను నిష్ఠతోడ
వాసుకర్పించ సిద్ధంబు జేసీ యుంచఁ
ముందు గోదమ్మ ధరియించి మురియు చుండు
తే.గీ
తండ్రి చాటుగన్ నిత్యము తనదు మెడన
దండ ధరియించ నొకనాడు తండ్రి గాంచె
నెంతటపచార మిదియని చింత తోడ
మందలించెనా గోదను మలినమనుచు
తే.గీ
విష్ణు చిత్తుండి యాగ్రహం కృష్ణుడెరిగి
జెప్పు చుండెను స్వప్నాన వచ్చి తాను
గోద ప్రియమైన సఖి మరి కోపమేల
తనదు మెడలోని దండ నాఘనత యనెను
తే.గీ
రంగనాథుండి రూపాన్ని రమణికొరకు
దాల్చి వరియింతు గోదతో తరలుమనెను
దర్శనంబుతో జన్మంబు ధన్యమవగ
నుదయ మునలేచి నుప్పొంగె మదనమాని
తే.గీ
మంగళంబుగన్ జనులతో రంగనాథ
కోవెలన్ జేరె చిత్తడు గోద తోడ
స్వామి కళ్యాణమాడంగ జనులు గాంచి
ధన్యమొందిరి యాస్వామి దర్శనముకు
తే.గీ
పిదప స్వామిలోనైక్యమై వేల్పుగాను
కొలువు దీరెను భువిలోన కోవెలందు
నాడు సంక్రాంతి భోగినీనద్బుతంబు
జరిగె గావునన్ భోగిని జరుపు చుండ్రు
తులసి వనమందు పసికందు ఫలము గాను
గాన వచ్చెనే బంగారు కల్ప వల్లి
విష్ణు చిత్తుండు మురిపాన పెంచుచుండ
నెదుగు చుండెను కృష్ణున్ని యెదన నిలిపి
తే.గీ
తండ్రి వాసుకై కూర్చిన దండ నెపుడు
ముందు ధరియించి యద్దాన మురిసె చూసి
వేసివిడిచిన మాలను వాసుమెడన
వేసి నుప్పొంగె నెరుగక విష్ణు చితుడు
తే.గీ
గోదచుట్టున్న నెయ్యాలు గోపికలని
తలచి కృష్ణున్ని ప్రియముగన్ వలచుచుండె
నమ్మకముతోడ కాత్యాయినమ్మ యనుచు
చెలులతో గోద వ్రతమును చేయబూనె
తే.గీ
మాస మారంబమందుండి మంగళముగ
భక్తితో ధనుర్మాసాన వ్రతముబట్టి
మాస మంతయున్ ప్రతిరోజు చేసి పిదప
పాడి వినిపించె శ్రీ కృష్ణ పాశురమును
తే.గీ
ఇట్లు ముప్పది దినములన్ యిష్టముగను
కృష్ణ గీతాలు పాడెను తృష్ణ తోడ
పాడినట్టి యీ గీతాలు పదిలముగను
పాశురములుగన్ పేరొంది వాసికెక్కెఁ
తే.గీ
గొప్ప భక్తుండు వేణుకు గోద తండ్రి
నిత్యమానంద మాలను నిష్ఠతోడ
వాసుకర్పించ సిద్ధంబు జేసీ యుంచఁ
ముందు గోదమ్మ ధరియించి మురియు చుండు
తే.గీ
తండ్రి చాటుగన్ నిత్యము తనదు మెడన
దండ ధరియించ నొకనాడు తండ్రి గాంచె
నెంతటపచార మిదియని చింత తోడ
మందలించెనా గోదను మలినమనుచు
తే.గీ
విష్ణు చిత్తుండి యాగ్రహం కృష్ణుడెరిగి
జెప్పు చుండెను స్వప్నాన వచ్చి తాను
గోద ప్రియమైన సఖి మరి కోపమేల
తనదు మెడలోని దండ నాఘనత యనెను
తే.గీ
రంగనాథుండి రూపాన్ని రమణికొరకు
దాల్చి వరియింతు గోదతో తరలుమనెను
దర్శనంబుతో జన్మంబు ధన్యమవగ
నుదయ మునలేచి నుప్పొంగె మదనమాని
తే.గీ
మంగళంబుగన్ జనులతో రంగనాథ
కోవెలన్ జేరె చిత్తడు గోద తోడ
స్వామి కళ్యాణమాడంగ జనులు గాంచి
ధన్యమొందిరి యాస్వామి దర్శనముకు
తే.గీ
పిదప స్వామిలోనైక్యమై వేల్పుగాను
కొలువు దీరెను భువిలోన కోవెలందు
నాడు సంక్రాంతి భోగినీనద్బుతంబు
జరిగె గావునన్ భోగిని జరుపు చుండ్రు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి