ప్రేమా ప్రేమా ఓ ప్రేమా
నను ప్రేమించిన నా భామ
ఎక్కడికెళ్ళావ్ నా ప్రియ లేమా
కనబడకున్నావ్ అయ్యో రామ !
మన ఇంటిని విడిచి వెళ్లావు
మరి కంటికి దూరం అయ్యావు
ఎక్కడ దాగి ఉన్నావో నీవు
ఇక తెలుపవ నీయొక్క తావు !
ఇరువురి మధ్య పెరిగెను దూరం
ఇక నాబ్రతుకే ఆయెను భారం
చెదిరిన గూడై కూలెను సంసారం
అదిరిన గుండెకు ఏది ఆధారం?
నువ్వు దాగుడుమూతలు ఆడించి
నా మదిలో ప్రేమను రగిలించి
మండే తొలిప్రేమకు అజ్యం పోశావు
ముందరి కాళ్లకు బంధం వేశావు !
నీ సిగ్గుల బుగ్గల మొగ్గల ముగ్గేసి
నా ఎదపై ముద్దుల పద్దులు వ్రాసి
మదిలో ప్రేమ దాహాన్ని పెంచావు
జయహో ప్రేమ అని దీవించావు!
నువ్వు ప్రేమ కబుర్లను చెప్పి
నన్ను పలు పబ్బుల చుట్టూ తిప్పి
ప్రేమించుకుందాం రా అన్నావు
వచ్చాక ఎందుకు తప్పుకున్నావు?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి