భార్య గుణం;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 

ఈ ప్రపంచంలో  అన్నిటికన్నా బాధాకరమైన విషయం బీదరికాన్ని అనుభవించడం  మనిషికి బ్రతకడానికి  తిండి  మానాన్ని కప్పుకోవడానికి బట్ట  తల దాచుకోవడానికి కొంప  లేకపోతే అతని బ్రతుకు దుర్భరంగా ఉంటుంది. ఎంత పేదవాడైనా  తాను రెక్కలు ముక్కలు చేసుకుని  చెమటోడ్చి  సంపాదించి  తన ఆలు బిడ్డలను  బ్రతికిస్తూ హాయిగా సంతోషంగా  ఉన్నప్పుడు భార్య ఆయనను ఎంతో గౌరవిస్తూ తాను చెప్పిన ప్రతి పనిని తూచా తప్పకుండా చేస్తూ పిల్లల బాధ్యత కూడా తానే తీసుకొని అవసరమైతే తాను కూడా చాకిరీ చేసి సంపాదిస్తూ  వేడి నీటికి చల్లటి నీరు తోడయినట్టుగా తన భర్త సంపాదనకు  తన సంపాదన కూడా తోడైతే  మరింత  సుఖాలను అనుభవించవచ్చును అలాగే ప్రేమతో  పిల్లలను దృష్టిలో పెట్టుకొని అలా చేస్తుంది 
గృహిణి. కాలం ఎప్పుడూ ఒకరకంగా గడవదు  మనిషి అన్న తర్వాత  ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది  దానితో మానసికంగా ఎంతో కృంగిపోవడం  దానివల్ల చేయవలసిన పనులు కూడా చేయలేకపోవడం  దానితో సంపాదన  తగ్గి బాధలు పడవలసిన స్థితి రావడం  సామాన్యంగా చాలామంది బీద కుటుంబీకులలో మనం చూస్తున్న దృశ్యం ఇది మన పెద్దవాళ్లు వివాహం జరుగుతున్న సందర్భంగా పురోహితులు  నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ చెప్పే మాటలు  ఆలోచనలో కానీ, మాటలలో కానీ చేతలలో కానీ ఇద్దరు ఒకే బాట మీద నడిచి వెళ్ళాలి  ఒక బండికి రెండు చక్రాల వలె  జీవితంలో సుఖాలను  కష్టాలను  కూడా సమంగా అనుభవించాలి  ఒకరికొకరు అండదండగా ఉండాలి  అని చెబుతూ ఉంటారు.
వేదం అన్నీ చెప్పింది  కానీ దానిని అనుసరిస్తున్న వారెవరు ఆ సూక్తులు జీవితంలో ఈ మనిషి వినలేదా విన్నవే కానీ కష్టకాలంలో అవేమీ గుర్తుకు రావు  వివాహం చేసుకొని తనను పోషించవలసిన భర్త  కావలసిన సరుకులను  కనీసం భోజనానికి కూడా గడవని స్థితిలో ఉన్నప్పుడు  ఆ స్త్రీ  ఎంత మనోవేదనకు గురి అవుతుంది అలాంటి సందర్భంలో ఆమె మనసు ఆమె స్వాధీనంలో ఉంటుందా. అతి చిన్న విషయానికి కూడా  ఏదో పుల్ల విరుపు మాట అనడం  దానివల్ల భార్యాభర్తలలో  మాట మాట  పిరికి  నిత్యం కలహాల కాపు రంగా తయారవుతుంది  ఇది చాలా కుటుంబాలలో జరుగుతున్న  ప్రత్యక్షంగా మనం చూస్తున్న విషయం  తనకు తెలిసిన విషయాన్ని  ఆటో వెరైటీలో అందమైన పదాలను కూర్చి మనకు అందించారు వేమన ఒకసారి మీరూ చదవండి.

"కూలి నాలి జెసి గొల్లాపు పనిజెసి
తెచ్చిపెట్టయాలు మెచ్చ నేర్చు  ఏమి జిక్క విపుని వేమరుదిట్టును..."


కామెంట్‌లు