👌తన గురించియు తాను
గొప్పగా పేర్కొనుట!
కలికాల ప్రభావము!
ఆత్మ బంధువులార! (1)
👌ధనము సంపాదనయె
ధర్మమార్గమే యగు!
ఈ కలియుగము నందు!
ఆత్మ బంధువు లార! (2)
👌అర్ధాంగి పలుకులే
అర్ధవంతము లౌను!
కలియుగ ప్రభావమున!
ఆత్మబంధువు లార! (3)
(ఆత్మ బంధుపదాలు., శంకరప్రియ.,)
👌ఎచ్చట భార్య మాటే.. వేద వాక్కు యగునో; ఎచ్చట అర్థ సంపాదన.. ధర్మమార్గ మగునో; ఎచ్చట స్వీయ ప్రతిభయే.. అన్నింటికన్నా గొప్పగా నుండునో; అటువంటి "కలియుగ అవతార పురుషునకు".. రెండు చేతులను జోడించి; నమస్కరించు చున్నాను! అని, నీలకంఠ దీక్షితులు నిందా స్తుతిగా (వ్యంగ్యముగా; పొగడినట్లుగా) పేర్కొన్నారు!ఇందులో.. కలుషములకు నిలయమైన, "కలికాల ప్రభావము"ను నిందించుచూ; ప్రార్ధనా శ్లోకమును వ్రాసారు!
👌యత్ర భార్యా గిరో వేదః!
యత్ర ధర్మో౭ర్ధ సాధనం!
యత్ర స్వ ప్రతిభా మానం
తస్మై "శ్రీ కలయే" నమః!
ఇది..నీలకంఠ దీక్షితులు వ్రాసిన "కలివిడంబన శతకము" లోని, సుప్రసిద్ధమైన శ్లోక రత్నము! ఇందులో, కవి.. వ్యాజస్తుతిలో పేర్కొన్నారు ! శివమస్తు!
🚩తేటగీతి
👌భార్య మాటలే శ్రుతులుగ వరలునెచట
అర్థ సాధనమై ధర్మ మలరుచుండు
ఆత్మ సంస్తుతి కొలమాన మౌచు సాగు
అట్టి "కలికాలము"నకు నే నంజలింతు!
(డా. అయాచితం నటేశ్వరశర్మ.,)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి