గానకోకిల వాణిజయరాం!!;- మిట్టపల్లి పరశురాములు. --సిద్దిపేట. -- చరవాణి:9949144820
తమిళనాడు పుట్టినూరు!
తనజిల్లపేరునెల్లూరు !!
బాల్యమందుపాటలోన!
సరిగమపదానిసలూర!!

గానమందుకోకిలమ్మ!
తేనెతీపివెన్నెలమ్మ !!
సకలభాషగీతములను!
మధురముగనుపాడెనమ్మ!!

తీయతేనెలొలుకుచుండ!
ద్రాక్ష రసముకమ్మగుండ!!
భక్తి ముక్తి రక్తి మీర!
పాటలెన్నొపాడుచుండ!!

స్వాతి కిరణ రాగమోయి!
ఎదలను కదిలించెనోయి!!
తనివితీర ప్రేక్షకులను!
ముగ్ధమతులజేసెనోయి!!

తొలి పొద్దు పొడిచింది!
తెలతెల్ల వారింది !!
తలుపుతీయుమనివేడ!
దైవమే నిలచింది !!

పూజలెన్నొజేయవాణి!
గుడిముందరనీలవేణి!!
పూలు తెచ్చి నిలచి భక్తి!
ముక్తి ఫలమునొందివాణి!!

గుప్పెడంతమనసులోన!
పాటపాడివినిపించెను!!
సుజాతమనసుకరిగించి!
నిలచెమహిళగుండెలోన!!

పాటలంటెప్రాణమోయి!
హాయిమీరపాడెనోయి!!
చిత్ర సీమ నేలివాణి!
స్వర్గసీమ కేగెనోయి!!
               *


కామెంట్‌లు