' ప్రసాద్' కు కుర్తాళం పీఠాధిపతి పతి చే సత్కారం




 మహిమాన్వితులు, మంత్రద్రష్ట, నడయాడే కాలభైరవులు కుర్తాళం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి  ఎనభై ఏడవ జన్మదిన వేడుకలు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం లలితా పీఠం లో  అత్యంత వైభవంగా జరిగిన సంధర్భంగా అతి పవిత్రమైన భీష్మ ఏకాదశి పర్వదినం నాడు ఆధ్యాత్మిక ధర్మరక్షణ విషయం పై కవితా గోష్టి లో సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్  ' సంపత్కారకుడు శివుడు' అని శివలీలలు గురించి స్వామి  సమక్షంలో చెప్పిన సందర్భంగా స్వామి వారు ప్రసాద్ మాస్టర్ ని ఆశీర్వదించి దుశ్శాలువ పూలదండతో  భీష్మ ఏకాదశి పర్వదినాన సత్కరించటం తన పూర్వజన్మ సుకృతం అని  సభాప్రాంగణంలో తెలియచేసారు.మాస్టర్ కి సాహితీమిత్రులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలియచేసారు

కామెంట్‌లు