విభూతి పవిత్రమైంది. లక్ష్మి ని ఇస్తుంది. శోకాన్ని రోగాన్ని పోగొట్టుతుంది. అందరిని వశీకరిస్తుంది. పరమేశ్వరుని స్మరిస్తూ విభూది ధరించాలి. అన్ని వస్తువులు కాలిస్తే బూడిదగా మారుతాయి. బూడిదను ఎన్ని మార్లు కాల్చినా బూడిదే మిగులుతుంది. కనుక నాశనం లేనిది, మార్పు లేనిది బూడిద. ఇలాంటి నాశనం లేని వస్తువుతో నాశనం లేని వాణ్ణి సేవిస్తున్నాం. దీన్ని ధరించడం వల్ల శరీరంలో చెమట వల్ల జనించే ప్రతి క్రియలు, ఇందువల్ల ఏర్పడే వ్యాధులు నివారింప బడతాయి. శరీరానికి కావలసిన వేడిని ఒకే విధంగా ఉండేటట్లు చేస్తుంది. ఆయువు పెరుగుతుంది. జటరాగ్ని ని వృద్ధి చేస్తుంది. రక్త ప్రసారం ఓజస్సు పెంపొందుతుంది. ఆయువు పెరుగుతుంది. చలిని తట్టుకునే శక్తిని పెంచుతుంది. శాంత స్వభావాన్ని చేకూరుస్తుంది.
హరిద్వార్, రుషికేష్ మొదలైన మంచు ప్రదేశాలలో కేవలం భస్మం మాత్రమే వంటి నిండా పూసుకొని, హాయిగా చలిలో తిరిగే సాధువుల్ని ఇప్పటికీ చూడవచ్చు. విభూతి అంటే ఐశ్వర్యమని అర్థం. భస్మములో కాల్షియం గుణం అధికంగా ఉంటుంది. నిర్గుణమైన శుద్ధ పరమాత్మ తత్వానికి భస్మం ప్రతీక.
విభూది - ప్రయోజనాలు.; -తాటి కోల పద్మావతి గుంటూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి