ఒంటరి మనిషి;-..యామిజాల జగదీశ్
ఒంటరివాడైపోతున్నాడు
మనిషి...కానీ
ఏదో ఒకరోజు తల్లడిల్లుతాడు 
ప్రత్యక్ష బాంధవ్యాలకోసం...

ఉదయం 
నిద్ర లేపడానికి నాన్నక్కర్లేదు
అలారం యాప్  alarm app ఉంది!

నడక వ్యాయామానికి
మిత్రుడక్కర్లేదు
స్టెప్ కౌంటర్ step counter ఉంది!

వడ్డించివ్వడానికి ఆమ్మక్కర్లేదు
జొమాటో, స్విగ్గీ zomato, swiggy app ఉన్నాయి!

ప్రయాణం చేయడానికి
బస్సక్కర్లేదు
ఉబెర్, ఓలా యాప్ uber, ola app ఉన్నాయి!

చిరునామా తెలుసుకోవడానికి
టీ కొట్టొతనో
ఆటో డ్రైవరో అక్కర్లేదు
గూగుల్ మ్యాప్ google map ఉంది!

పచారీసామాన్లు కొనడానికి
శెట్టితాత దుకాణానికో
రామయ్య దుకాణానికో
వెళ్ళక్కర్లేదు
బిగ్ బాస్కెట్ big basket ఉంది!

బట్టలు కొనడానికి 
దుకాణానికి వెళ్ళక్కర్లేదు
అమెజాన్, ఫ్లిప్ కార్ట్ యాప్  
amazon , flipkart app ఉన్నాయి!

ప్రత్యక్షంగా కలిసి 
మనసారా నవ్వుకోడానికో
మాట్లాడటానికో మిత్రుడు అక్కర్లేదు
వాట్సప్, ఫేస్ బుక్ 
whatsapp, facebook ఉన్నాయి!

అవసరానికి డబ్బులు పొందడానికి
చుట్టాన్నో మిత్రుడినో కలవక్కర్లేదు
పేటిఎం, గూగుల్ పే యాప్ 
paytm google pay app ఉన్నాయి!

ఎన్నో ఎన్నెన్నో విషయాలు
తెలుసుకోవడానికి
ఉండనే ఉంది గూగుల్ google!

ఇలా ఒంటరిగా బతకడానికి
ప్రతి అవసరం తీర్చుకోవడానికి
ఉందనుకుంటున్న రకరకాల యాప్ లు apps 
ప్రత్యక్ష సంబంధ బాంధవ్యాలలోని
అనురాగ ఆప్యాయతలను 
నిలువునా మింగేస్తున్నాయి !!!

అరచేతిలో సెల్ఫోన్  పెట్టుకుని 
తలవంచి
ప్రతి అయిదు పది నిముషాలకు 
కళ్ళనూ వేళ్ళనూ దానికప్పగించి
ఇరుగుపొరుగువారితోపాటు
ఇంట్లో ఉన్న వారినిసైతం 
నిర్లక్ష్యం చేసే రాకాసివలలో 
పడిపోయాం పురుగుల్లా....

అరచేతి ఫోన్లకు బానిసలైన
మనుషుల మధ్య బంధానుబంధాలు
మళ్ళీ ఊపిరిపోసుకుని
మమతానురాగాలతో 
అల్లుకుపోయే కాలం కోసం
కోటి ఆశలతో నిరీక్షించడం అత్యాశా...!

- చెన్నై నుంచి తమిళ మిత్రుడు మణిమారన్ పంపిన దానినే స్వల్ప మార్పులతో నాకొచ్చిన తెలుగు మాటలతో అల్లిన మాటలివి - అతినికి కృతజ్ఞతలతో ...యామిజాల జగదీశ్

కామెంట్‌లు