నేను బయట ఉన్నాను!!?;- ప్రతాప్ కౌటిళ్యా
నేను బయట ఉన్నాను
నదిలా
జలపాతంలా పారుతున్నాను
పర్వతంలా
సముద్రంలా భద్రంగా
నేను బయట ఉన్నాను!!!

ఎడారిలా
అడవిలా
ఆరుబయట ఆకాశంలా
నేను బయట ఉన్నాను!!!

చీకటిలా వెలుతురులా
కలిసే
నలుపు తెలుపులను
తెలిపే
పగలు రాత్రుల్లా
నేను బయటే ఉన్నాను!!!

కురిసే వర్షంలా
మెరిసే నక్షత్రంలా
సూర్యచంద్రుల్లా
సమస్త లోకాల్లా
నేను బయటే ఉన్నాను!!!!

ఆకుపచ్చని ఆకులా
సంధ్య పొద్దుల పారాణిలా
నీలిరంగుల ఆకాశ సముద్రాల్లా
ఇంద్రధనస్సులో ఏడు రంగుల్లా
కిరణాల్లో కోటి రంగుల్లా
నేను బయటే ఉన్నాను!!!?

తలుపులు మూయకండి
బయట తుఫాను
లోపల అగ్ని ప్రమాదం
అపాయం ఉంది
బయటకు వెళ్ళకండి!!?
నేను బయటే ఉన్నాను!!!

పగ ద్వేషం ఈర్ష్య
కసి కోపం
విషం నిండిన కోరల్లా
లోపల లోలోపల
నాగుపాముల ఆట
నేను బయటే ఉన్నాను!!!?

కులం మతం శీలం
పేదరికం
విలువలు కలలు
స్త్రీ పురుషుల వివక్షలు
రాక్షస క్రీడలు
లోపల లోలోపల
నేను బయటే ఉన్నాను!!!?

తలుపులు మూయకండి
బయట తుఫాను
లోపల అగ్నిప్రమాదం
ఆపాయం
అపస్మారక స్థితి నాది
నేను బయటే ఉన్నాను!!!!?

లేళ్లు కుందేళ్ళు
నెమళ్లు
పచ్చని వనంలో
ఎగిరే పక్షులు నీలాకాశంలో
రంగురంగుల
పూల తోటల్లో
రంగురంగుల
సీతాకోచిలకల్లా
నేను బయటే ఉన్నాను!!!!?

Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
8309529273

కామెంట్‌లు