శబ్ద సంస్కృతి!అచ్యుతుని రాజ్యశ్రీ
 భాషలో పదాలు ఇలా వాడుకలో వచ్చాయి.కొద్దిగా ఎగరేసి లడ్డు చుడ్తారుకాబట్టి లడ్డు అన్న పదంవచ్చింది.ఆంగ్లంలో లాడ్ హిందీ లో లడకా లాడ్ లా ఐంది. సంస్కృత లడ్ ధాతువు వల్ల లాడ్ వచ్చింది. కొడుకు కూతురు ని లాడ్ లా లాడలీ అంటారు. రాజస్థాన్ లో కొడుకు కోడలిని లాడో లాడీ అంటారు. ఆంగ్లంలో లేడీ అంటే గౌరవం.
ఆహారం అంటే మనం ఇప్పుడు భోజనం గా భావిస్తున్నాం.హర్ అనే ధాతువు నించి వచ్చింది. హరణ్ బలవంతంగా తీసుకుని పోవటం.ఆ+హర్ అంటే పశువుని లాక్కెళ్ళటం చంపటం.అదే ఆహారం గా మారింది. ఫలహారం అన్నాహారం దుగ్ధాహారం అని వాడుతున్నారు. పూర్వం మాంసభక్షణ చేసేవారు కాబట్టి ఆహార్ వచ్చింది. 
హిందీ లో ఆప్ అంటే తమరు.ఆత్మ నించి ఈపదం వచ్చింది. నేపాలీలు అత్యంత మర్యాదకై హజూర్ అంటారు. దీన్ని మనం జీహుజూర్ గా మార్చాం.
భారతీయ సంస్కృతి లోనమ్రత మర్యాద కి ప్రాధాన్యత ఇస్తాము.నమస్తే  ప్రణామం దండవత్ ప్రణామం చరణస్పర్శ నేలకు నుదురు తాకించి మొక్కటం చేతులు జోడించటం.

కామెంట్‌లు