@ కుమిలిపోతున్నావా !?
******
ఆ లయకర మహా శక్తికి....
ప్రతీకాత్మక రూపాన్నిచ్చి...
భక్తి భావాన్ని నిoప గలిగిన
గొప్పఆధ్యాత్మికకథాసృష్టికర్తా
ఓ మహోన్నత మానవా.!
నీవు పాదుకొల్పిన భక్తి....
మూఢభక్తిగామారిపోయిOదని
కుమిలిపోతుందా నీ ఆత్మ !?
******
" అర్ధం - పరమార్ధం "
******
అపసోపాల ఉపవాస,
జాగరణ, అభిషేక పూజలు
ఒకవైపు.... !
జాగరణ పేరుతో...
బూతు వినోద కార్యక్రమాలు!
మందు - విందు - విలాసాలు...
సినిమాలు, షికార్లు... !!మరొక వైపు...
ఇదీ... నేటి * శివరాత్రి *
*******
* సందేశం *
****
భక్తి భావనలను పెంపొందించి
పాప-పుణ్యాల విచక్షణను
పెంచి..., సృష్ఠి స్థితి శక్తుల..... అహంకారాన్ని నిర్మూలించి , లోకహితంకోసంగరలాన్నైనా,మింగమనేఅత్యుత్తమమాన వీయ ప్రబోధం ....,
మహాశివరాత్రి సందేశం... !!
*******
@* శివరాత్రి *@
***
స్థితికర సృష్టికి లయకర శక్తి...
ఏకమనేకమైన స్థితిని...
ఏకం చేసే శివలింగ తత్వం !
సత్యము,సుందరమైన జగతి కి
ఆధార బంధం శివం.... !
ఆద్యంత రహిత నిర్గుణోపాస
సగుణ విన్యాసం... !
శివరాత్రి మహాత్మ్యం..... !!
******
* అభిషేకారాధితం *
. *****
సంగీత - సాహిత్య - నటనాభి
నయ,సమన్వయస్వరూపం...
నటేశం...,లయకర విన్యాసం
రాక్షస - దైవత్వాలను రక్షించగ గరళమును స్వీకరించు శివ తత్వం మహోన్నత వ్యక్తిత్వం
శివరాత్రి.......,భక్తి, శ్రద్దల అభిసేకారాధితం....,!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి