ఊహాతీతం..... ఆ భావనా జలధి @-- కోరాడ నరసింహా రావు

 ప్రకృతిలో... ఏది... ఎందుకు ఎలా ఏర్పడుతుందో గొప్ప చిత్రకారుని ఊహలకు గాని... 
మహా కవుల భావనలకు గానీ అందనంత అద్భుతంగా.... !
ఆహా..... !
     యేమా  భావనాజలది !!
ఏమా రచనా చమత్కృతి !
    సర్వేశ్వరా.... !
   నీ సృష్ఠి వైచిత్రి... అద్భుతం !
ఏవేవో శోధించేసి, సాధించేశా మనుకుని విర్రవీగే మనుషులు సిగ్గుతో తలదించుకునేలా....
 ఎన్నెన్ని వింతలు.... ఏమా విడ్డూరాలు !!
    ఈ సృష్టిలో  నీకన్నా గొప్ప చిత్రకారుడెవరు.... !?
    నీకన్నా గొప్ప కవి ఎవరు ?! నువ్ లేవు - లేవన్నవారికి.... 
ఎంత చక్కగా నీఉనికిని ఎరుకపరచుతున్నావు తండ్రీ !
  నీవు లేక మే మెక్కడ ?
    ఈ  సృష్ఠి ఎక్కడ తండ్రీ... !!
సకల సృష్టికీఆధారభూతుడవు
నీలీలలు పామరులకు అగోచరములు తండ్రీ.... !!
      ******
కామెంట్‌లు