పాలిచ్చే ఆవులకి, గేదెలకి బలం కోసం, ఎక్కువ పాలు ఇవ్వటానికి నీళ్ళల్లో బియ్యపు తవుడు, వంట ఇంట్లో తయారయ్యే కూర చెక్కుల లాంటి ఇతర తడి చెత్త, మిగిలిన ఆహార పదార్ధాలు కలిపి తాగిస్తారు. అది చాలా చిక్కగా ఉంటుంది. దాన్ని కుడితి అంటారు. అందులో ఏదయినా జీవం పడితే అంత తేలికగా బయట పడలేదు.
తమకి తెలిసో, తెలియకో కొన్ని పరిస్థితుల్లో చిక్కుకున్న వాళ్ళు ప్రయత్నం చేసినా బయట పడలేక పోయినప్పుడు ఈ సామెత వాడతారు.
@@@@
ఆ రోజు స్కూల్లో జరగబోతున్న సాంస్కృతిక కార్యక్రమం కోసం ఏడో క్లాస్ చదువుతున్న లహరి ప్రత్యేకంగా తయారయింది.
బయలుదేర బోతూ ఉండగా కార్లో ఇంటికి ఎవరో వచ్చారు.
ఇంటికి వచ్చి పోయే వారితో సంబంధం లేని లహరి తనపాటికి తను తలొంచుకుని..తను పాడబోయే పాట మననం చేసుకుంటోంది.
ఇంటి ముందు కార్లోనించి దిగిన వ్యక్తి లహరి వంక తల తిప్పి చూస్తూ లోనికి నడిచాడు.
"మేడం మీ అమ్మాయిది మంచి ఫొటొజెనిక్ ఫేస్. మన సినిమాలో ఒక చిన్న అమ్మాయి పాత్ర ఉంది. రెండు మూడు సీన్లల్లో కనిపిస్తుంది. మొత్తం కలిపి ఒక పది నిముషాల పాత్ర. తనయితే బాగా నప్పుతుంది అనిపిస్తోంది" అన్నాడు ఆ వచ్చిన వ్యక్తి కధానాయిక కల్పనతో!
"దాని చదువేంటో..దాని ఆటలేంటో అంతే! అమ్మో మీ మాట విన్నదంటే చంపేస్తుంది. దానికి సినిమాలన్నా, ఆ రంగం అన్నా విపరీతమైన ఎలర్జీ. నాకు దగ్గరగా ఎవరైనా కూర్చున్నా..నిల్చున్నా కంపరంగా చూస్తుంది. అదంతా నటన అని ఎంత చెప్పినా చిరాకు పడుతుంది" అన్నది కల్పన.
కల్పన చెప్పింది విని కూడా డైరెక్టర్ రంగనాధ్ లహరి మీద తన దృష్టి మళ్ళించుకోలేదు. ఇప్పుడింకా చిన్నతనం! ఆటల మీద ధ్యాస ఎక్కువ ఉండటం సహజమే అనుకుని అప్పటికి ఊరుకున్నాడు.
లహరి నైంత్ క్లాసులోకి వచ్చింది. పధ్నాలుగేళ్ళ వయసులో ఉన్న లహరి మొహంలో ఇంకా పసితనం వదలనట్టే ఉన్నా... చూపరులకి ఆకర్షణీయంగా కనిపిస్తున్నది.
కల్పన చేస్తున్న చిత్రం పూర్తి అయి విడుదల అయింది. సినిమా సూపర్ హిట్.
విజయోత్సవాలు భారీగా జరిగాయి. వేడుకకి రమ్మని కల్పన ఎంత పిలిచినా లహరి రావటానికి ఇష్టపడలేదు. నెలాఖరుకి ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ పోటీలున్నాయి..తను బాడ్మింటన్ ప్రాక్టీస్ కి వెళ్ళాలని తల్లి ఆహ్వానాన్ని తిరస్కరించింది.
అంత భారీ వేడుకకి తన కూతురు రాలేదేమని అందరూ కల్పనని అడిగారు. తనకేవో ఆటల పోటీలున్నాయని చెప్పి ఊరుకుంది.
ఇంటర్ స్కూల్ బాడ్మింటన్ మాచెస్ జరుగుతున్నాయి. తను అనుకున్నంత బాగా ఆడలేక పోతున్నది లహరి.
"నీ ధ్యాసంతా మీ అమ్మ సినిమా వేడుక మీద ఉన్నట్టుంది. నువ్వు కూడా హాయిగా ఆ రంగానికి వెళ్ళిపో. నీకు ఏకాగ్రత కుదరట్లేదు" అన్నారు గేంస్ టీచర్ చిన్నగా!
తలతిప్పి ఒక్కసారి కోపంగా ఆవిడ వంక చూసి బాధగా తల దించుకుంది. అక్కడ ఏమీ మాట్లాడే పరిస్థితి కాదు.
"ఏంటే సినిమా యాక్టర్ కూతురు సినిమా యాక్టరే అవ్వాలని రూలేమైనా ఉందా? వాళ్ళకి వేరే టాలెంట్స్, ఇంటరెస్టులు ఉండకూడదా? యాక్టర్స్ పిల్లలు స్పోర్ట్స్ లో రాణించకూడదా?"
"ఎంత గొప్ప ఆటగాళ్ళైనా ప్రతి సారీ వాళ్ళదే పై చేయిగా ఉండదు కదా! ఆ విషయం అందరికీ తెలుసు. చదువుల్లో పైకి రాకూడదా? నాకు పెద్ద సైంటిస్ట్ అవ్వాలనుంది" అన్నది కళ్ళు తుడుచుకుంటూ లహరి, స్నేహితురాలు ప్రియాంకతో.
"మనం సెవెంత్ క్లాసులో ఉండగా ఒక సారి టీచర్ ఏం చెప్పారో నీకు గుర్తుంది కదా! రూపు రేఖలు..అందచందాలు...డబ్బు ఇవన్నీ కొన్నాళ్ళే ఉంటాయి..తరువాత ఉండచ్చు..పోవచ్చు. చదువు..విజ్ఞానం మాత్రం మనం బతికున్నంత కాలం మనతోనే ఉంటాయి అని. అవి ఎవరు దోచుకోలేని సంపద అని. మన చదువు మనని పదిమందిలో ప్రత్యేకమైన గౌరవంతో నిలబెడుతుంది. అందుకే నాకు బెల్లం చుట్టు మూగే ఈగల్లాగా వెంటబడే ఈ గ్లామర్ ప్రపంచం అంటే అయిష్టం! అసహ్యం!"
"వయసుకి మించి మాట్లాడుతున్నాననిపిస్తోంది కదా! మా ఇంట్లో జరిగేవి చూస్తుంటే వయసుకి మించిన అనుభవాలు వస్తున్నాయి... ఇవన్నీ బాగా తెలుస్తున్నాయే" అన్నది లహరి.
"ఎవరో అన్నారని నువ్వు బాధ పడకే. మన తల్లిదండ్రుల వృత్తి వ్యవహారాలు..వాళ్ళు ఉన్న రంగాల గురించి నలుగురు మాట్లాడటం సహజమే! అది ఏ డాక్టరో..టీచరో అయితే నలుగురి కామెంట్స్ మనం పెద్దగా పట్టించుకోం. అవి మనని బాధించవు కూడా! సినిమా అనేది గ్లామర్ రంగం. రంగు రంగుల ప్రపంచం అది. అక్కడ ఆకర్షణలు బలంగా ఉంటాయి."
"మనకిష్టమైన రంగం ఎన్నుకునే స్వేచ్ఛ మనకున్నా మధ్య మధ్యలో ఇలాంటి కామెంట్స్ .. అడక్కపోయినా సలహాలూ వస్తూనే ఉంటాయ్. అవి పట్టించుకోకు" అన్నది...సినిమా రంగం గురించి ఇంట్లో అమ్మా..నాన్నా మాట్లాడుకుంటున్న మాటలు ఒంటపట్టించుకున్న ప్రియాంక ఆరిందా లాగా.
@@@@
కల్పనవి వరసగా మూడు చిత్రాలు హిట్టయ్యాయి.
నిర్మాతలు, దర్శకులు కల్పన ఇంటి ముందు క్యూ కట్టారు.
లహరికి పదహారేళ్ళు వచ్చాయి.
ఒక చిత్రంలో కధానాయికకి ఉండే 5-6 గురు స్నేహితురాళ్ళల్లో ఒకమ్మాయిగా లహరిని తీసుకుంటామని కల్పనని ఒప్పించారు.
"ఎప్పటి నించో నిన్ను నటించమని అడుగుతున్నారు. ఇది కూడా పెద్దగా నిన్ను ఇబ్బంది పెట్టని సీన్లే. ఈ రంగంలో నా పరపతి..పరిస్థితి గురించి నువ్వు కూడా ఆలోచించాలి కదమ్మా! మరీ అంత మొండితనం ఎందుకు" అన్నది కల్పన అనునయంగా కూతురు లహరితో.
"సరే ఇదే మొదలు..ఇదే చివర. ఇంకెప్పుడు నన్ను ఇబ్బంది పెట్టకు" అని ఆ సినిమా వరకు నటించటానికి ఒప్పుకుని సెట్స్ కి వెళ్ళింది లహరి.
"మంచి రంగు..కళ గల మొహం..చక్కటి జడ తో భవిష్యత్ హీరోయిన్ అయ్యేలా ఉన్న ఈ అమ్మాయెవరో? డైరెక్టర్ గారు బాగానేపట్టారు" అని వెనక ఎవరో మాట్లాడుకోవటం వినిపించి చివ్వున తలతిప్పి చూసింది.
"అబ్బో కళ్ళు కూడా భలే ఉన్నాయే" అని మళ్ళీ కామెంట్ వినిపించింది.
"ఇందుకే నాకు ఈ రంగం అంటే అసహ్యం. మనిషి రూపాన్ని చూసి నిర్మొహమాటంగా అమర్యాదగా కామెంట్ చేస్తారు. నీ మాట మీద వచ్చాను" అని తల్లితో తగాదా వేసుకుంది.
ప్రముఖ హీరోయిన్ అని తామంతా గౌరవంగా చూసే వ్యక్తి కూతురిని బుజ్జగిస్తూ
నటనకి ఒప్పించటం చూసిన ఒక వ్యక్తి...షాట్ అయిపోయాక నెమ్మదిగా లహరి దగ్గరకి వచ్చి "ఈ రంగమే ఇంత అమ్మా! ఒక సారి ప్రవేశించాక "కుడితిలో పడ్డ ఎలుక" లాగా తన్నుకోవటమే కానీ అనుకున్నంత తేలికగా బయట పడలేరు."
"వచ్చిన పేరు నిలబెట్టుకోవటానికి..తమకి గుర్తింపు తెచ్చిన దర్శకుల, నిర్మాతల కోరిక మన్నించటానికి కుటుంబ సభ్యులని ఇందులోకి దింపటం సర్వ సాధారణంగా చూస్తూ ఉంటాం!"
"కుటుంబ సభ్యులు తమకిష్టమై వస్తే ఫరవాలేదు కానీ, లేకపోతే మీ లాగే ఊపిరాడక గిల గిల్లాడతారు" అన్నాడు.
ఇంటికొచ్చాక ప్రియాంకకి ఫోన్ చేసి మధ్యాహ్నం జరిగింది చెప్పి "ఇతనెవరో నా మనసు సరిగా అర్ధం చేసుకున్నాడు" అన్నది.
"ఆ:( అతను ఆ రంగం వాడేగా! నీతో సానుభూతిగా మాట్లాడుతున్నట్టుగా ఉండి నీ మనసులో స్థానం సంపాదించాలనే ఆలోచన కూడ అయుండచ్చు కదా! ఈ రంగం ఒక ఊబి. నిన్ను ఉచ్చులోకి లాగేవరకు ఇలాగే మాట్లాడతారు. అతనన్నట్టు నీ పని "కుడితిలో పడిన ఎలుక" తీరే! జరిగిందేదో జరిగింది."
"ఇక ముందు ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా నీ చదువు మీద శ్రద్ధ పెట్టు. మీ అమ్మగారు కూడా ఏమి చెయ్యలేకే... నిన్ను సినిమాలోకి పరిచయం చెయ్యమని వారు అన్నప్పుడు ఈ ఒక్కసారికి రమ్మని బతిమాలి ఉంటారు. వీలైతే ఇంటికి దూరంగా హాస్టల్లో చేరు. నీ ఆలోచనని ఆమోదించి ప్రోత్సహించే నీ దగ్గరి బంధువుల సహాయం తీసుకో" అని భుజం తట్టి ధైర్యం చెప్పింది.
లహరి అనుకున్నట్టే హాస్టల్లో చేరి శ్రద్ధగా చదివి ఇంటర్..డిగ్రీ డిస్టింక్షన్ తో పాస్ అయి సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఫిజిక్స్ లో చేరింది. మంచి ర్యాంకుతో పాస్ అయి తను కోరుకున్నట్టు BARC లో సైంటిస్ట్ గా చేరింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి