సుప్రభాత కవిత ; - బృంద
అందరిదీ ఒకటే దారి
బ్రతుకుదారి....

అడ్డంకులు లేని సాఫీ దారులు
కొందరివైతే

ముళ్ళూ రాళ్ళూ నెట్టుకుంటూ
దారిచేసుకుంటూ సాగేవారు కొందరు

ఒడిదుడుకులు లేని 
దారి వుంటుందేమో కానీ

వేదన యాతన లేని
మనసుండదు  లోకంలో

ఎవరి సమస్యలు వారికి
భరించలేనివే....

ఎవరి కలతలు వారికే
సొంతం....

చిన్నవాటికి కుంగిపోక
పెద్దవొస్తే బెదిరిపోక
ముందుకు సాగడమే 
జీవితం

ప్రతి సమస్యా పరిష్కారంతోనే
పుడుతుంది.  అదేవిటో
తెలుసుకునే క్రమమే కష్టం 

ప్రతి కష్టం  శాశ్వతం కాదు
అనుభవించే క్రమమే  జీవితం

ఎవరికైనా ఆశ ఒకటే ఆధారం
గాలిపటానికి దారంలా..

ఆశతో ఉత్సాహం ...
ఉత్సాహంలో సహనం
సహనంలో సంతోషం
సంతోషమే సగం బలం

ఊహలపల్లకీ మోస్తూ
జీవిత రహదారిలో
ప్రేమ పంచుతూ తిరిగి పొందుతూ

సాగిపోయే  గమనమే 
జీవిత గమ్యం....

తృప్తి గా మరో ఉదయం
ప్రసాదించిన పరమాత్మునికి
అంజలి ఘటిస్తూ

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు