పుట్టిన రోజు! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆరోజు జయ మార్కెట్ కి వెళ్లింది.ఓపక్కపూలమ్మి కూచుంది.రంగురంగులపూలతో నుదుట పెద్ద బొట్టు నవ్వుతూ కబుర్లు చెబుతూ టకటకా పూలు అమ్మేస్తోంది.మంచిమాటకారిగూడా! ఆమె చెప్పిన ధరకి నోరెత్తకుండా కొంటున్నారు.
కాస్త దూరంలో బక్కచిక్కిన పీలికలచీర జాకెట్ లో పండిన జుట్టు తో లోతు కు పోయిన కళ్ళతో అవ్వ కూచుంది.ఎదురుగా బొప్పాయి పళ్లు ఉన్నాయి.రోజూ కొడుకు చేతిలో పది రూపాయలు పెట్టిఇడ్లీ పొట్లం చాయ్ ఇచ్చిపోతాడు.మళ్లీ సాయంత్రం దాకా మొహం చూడడు."అమ్మ!పళ్లు పప్పడకాయలు" నీరసంగా అరుస్తోంది.కానీ ఒక్కరూ ఆమె వైపు తొంగి చూడటంలేదు.జయ ఆలోచిస్తూ అనుకుంది" పళ్లు ఇప్పుడే బాగా పండినవి.సాయంత్రంకి అవి ఎండకి కుమిలిపోతుంటారు ఖాయం! ఈరోజు కొడుకు పుట్టిన రోజు.అవ్వ దగ్గర కెళ్ళి"రోజు పళ్లు అమ్ముడుపోతాయా?" అనిపలకరించింది,అవ్వ దీనంగా అంది"ఏం చెప్పేది బిడ్డా!ఓ50రూపాయలు అమ్మినా.రేపటికి ఇవి ఎందుకూ పనికి రావు.నాకోడలు తిట్టిపోస్తది." అంతే జయ వెంటనే ఓ100చేతిలోపెట్టి మిగిలిన పళ్లు కొనేసింది.చాక్లెట్ కేక్ బదులు ఫ్రూట్ సలాడ్ జామ్ చేసి పిల్లలకి పెట్టవచ్చు.ఆరోగ్యం అవ్వండి సాయం చేసినట్లు ఉంటుంది.ఆసాయంత్రం "కేక్ కట్ చేసి క్యాండిల్స్ ఆర్పటం మన పద్ధతి కాదు అని పిల్లల కి చెప్పి పాయసం పులిహోర జామ్ పెట్టింది.అందరికీ పెన్సిల్ రవ్వ లడ్డు కవర్ లో పంచింది.ఆపళ్ల అవ్వ సంతోషంగా దీవిస్తు జయ కి కనపడుతోంది 🌹
కామెంట్‌లు