ఆదివారాలు;- - యామిజాల జగదీశ్
ఓ అరవై ఏళ్ళ క్రితం
ఆదివారాలు 
ఇచ్చిన సంతోషాలను
సంబరాలనూ
ఇప్పుడెంత ఖర్చు పెట్టినా
మళ్ళీ పొందలేం

అప్పట్లో
శనివారం సాయంత్రం వస్తే చాలు
మరుసటి రోజు ఆదివారం అనుకుంటూ
సంతోషం ఆరంభమవుతుంది

మిగిలిన రోజుల్లో
ఉదయమే నిద్ర లేవడానికి
మనసే రాదు
కానీ
ఆదివారం మాత్రం 
పొద్దున్నే అలారం అవసరం లేకుండానే
లేవడం...

మిగిలిన రోజుల్లో ఉదయం
చాలా వరకు 
సద్ది అన్నమే
కానీ
ఆదివారం కచ్చితంగా 
ఇడ్లీయో దోశో ఉంటుంది

అది తినేసి
నాన్నతో కలిసి బజారుకి వెళ్ళి
ఇష్టమైనవి కొనుక్కొస్తుంటేనే
నోరూరడం మొదలు

అమ్మ వంటంతా చేసేలోపే 
ఓమారు ఇరుగుపొరుగు పిల్లలతో 
ఆటాపాటా

అప్పట్లో 
ప్రతి సీజనుకీ
ఓ ఆట ఆడాల్సిందే
ఆనందాన్ని అనుభవించాల్సిందే

ఓమారు బొంగరం
ఓమారు గోలీ
ఓమారు కర్రాబిళ్ళా
ఓమారు దాగుడుమూతలు
ఓమారు గాలిపటం
ఆయా సీజన్ కి తగ్గట్లు 
ఆడటం
ఆనందించడం

కాస్త పెరిగి పెద్దయ్యాక
క్రికెట్ ఆడటం ఆరంభించేస్తాం

ఉదయం త్వరత్వరగా తినేయడం
క్రికెట్ ఆడటానికి వెళ్ళడం
మధ్యాహ్నం అన్నం కూడా మరచిపోయి
ఆడటం...

ఆట మధ్యలో
ఎవరో ఒకరు 
యాభై పైసలకో 
రూపాయికో రీటా ఐస్ క్రీమ్ 
కొనిపెట్టడం
సోడా తాగడం

సాయంత్రం వరకు ఆడి
ఆలస్యంగా ఇంటికొచ్చి
అమ్మ తిట్లు వింటూ
అన్నం తినడం 
ఓ మధుర జ్ఞాపకం

సాయంత్రం ఏడు గంటలకే మొదలు
రేపు సోమవారం 
స్కూలుకి వెళ్ళాలని
దిగులు గూడు కట్టుకుంటుంది
మనసులో

అరకొర మనసుతో
పనులు కానిచ్చుకోవడం
ఏవేవో ఆలోచిస్తూ
నిద్దట్లోకి ఒదిగిపోవడం

మరుసటిరోజు సోమవారం
ఉదయం నిద్రలేవడానికి మనసు రాదు
అయినా లేచి పనులన్నీ కానిచ్చుకుని
స్కూలుకెళ్ళడం
ఒకరికొకరం
ఆదివారమెలా గడిపామో 
చెప్పుకోవడంలోని ఆనందమే వేరు

మళ్ళీ ఆదివారం
ఎప్పుడొస్తుందాని 
ఎదురుచూడటం
సోమా మంగళా బుధా అంటూ
రోజులు లెక్కపెట్టడం...

ఇప్పుడు
పూర్వంకన్నా 
ప్రజలకు వసతులు 
పెరిగాయి
టెక్నాలజీ అదనం...

కానీ
ఆనాటి బాల్యస్మృతులలోని
ఆదివారం పేజీలలో
పొదుగుకున్న 
ఆనందాలను పొందలేం...


కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం