కడవ పద గేయం; --గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు.
మట్టితో చేసిన
మదిని దోచే కడవ
చల్లని జలమునిచ్చి
మేలు చేసే కడవ

ఫ్రీజ్ లో నీరు కన్న
కడవ నీరు మిన్న
మట్టిలో లవణాలు
మంచి చేయునురన్న!!

" కడవ-కాకి" కథ
అందరికీ తెలుసు
కడవ తో లాభాలు
ఎందరికిల తెలుసు?

మట్టి కడవ లు తరిగె
లోహ బిందెలు పెరిగె
కొన్ని చోట్ల మాత్రం
ఆనవాలగా మిగిలె


కామెంట్‌లు