సునంద భాషితం ; - వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -39
కూప యంత్ర ఘటికా న్యాయము
*****
కూపము అంటే బావి లేక నూయి. కూప యంత్ర ఘటి(క) అంటే చేద, బొక్కెన చిన్న కుండ లేదా కడవ. యంత్రము అంటే ఇక్కడ చక్రము అనే అర్థంతో కూడా తీసుకోబడింది.
నూతిలో నీళ్ళు చేదేటప్ఫుడు చక్రము లేదా గిరక మీద చేంతాడుతో కడవ లేదా బొక్కెన పైకి కిందకీ , కిందికి,పైకి  వెళుతుంది.అంటే రెండు రకాల స్థితులైన ఊర్ధ్వగతి, అధోగతి పొందుతూ ఉంటుంది.పైకి వచ్చేటప్పుడు నీటితో వస్తుంది.లోపలికి పోయేటప్పుడు ఖాళీగా వెళుతుంది. దీనినే కూప యంత్ర ఘటికా న్యాయము అంటారు.
దీనిని జీవితానికి, జీవించే విధానానికి  అన్వయించుకుందాం.
సంసార జీవితంలో లేదా వ్యక్తిగత జీవితంలో అనేక ఉత్థాన పతనాలు ఉంటాయి.ఊర్థ్వ,అధోగతులు తరచూ సంభవిస్తూ ఉంటాయి.
అవే సంతోషాలు, బాధలు, కష్టాలు, సుఖాలు. లాభాలు, నష్టాలు.
 ఊర్థ్వ గతిని అంటే ఉన్నత స్థితిని పొందే సమయంలో మనిషి స్థితి కూడా ఇలాగే ఉంటుంది... బొక్కెన  బావిలోకి వెళుతున్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళక పోతే అటూ ఇటూ గోడలకు తాకుతూ ఉంటుంది.కానీ  నీటిని నిండుగా నింపుకున్న తర్వాత తర్వాత స్థిరంగా కదులుతూ పైకి వస్తుంది.
జ్ఞాన దృష్టితో చూస్తే... ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా మరింత లోతుగా శోధిస్తూ అధ్యయనం చేస్తూ మనసు అనే కడవ లేదా బొక్కెన నిండా విజ్ఞానాన్ని నింపుకోవాలి అనే సందేశం ఇందులో ఇమిడి ఉంది.
మనిషికి కూడా అంతే.జ్ఞాన సముపార్జనలో ఎన్నో  అవరోధాలతో  కూడిన అనుభవాలు ఎదురవుతాయి.  వాటిని సహనంతో ఎదుర్కొంటేనే  మనసనే కడవ నిండా జ్ఞానాన్ని నింపుకోగలడు.
మనిషి  కూడా స్థితప్రజ్ఞుడైతే తొణకని కుండలా భాసిస్తాడు. అలా కానప్పుడు ఖాళీ కుండలా ఎటుపడితే  క్రమశిక్షణ లోపించిన వాడై జ్ఞాన రహితుడుగా కనబడుతాడు. ఈ విధంగా " నిండు కుండ తొణకదు అనే సామెతను ఈ న్యాయానికి సరైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఈ విధంగా జీవితానికి జీవించడానికి ఈ ప్రపంచమనే మహా జ్ఞాన కూపంలో అదరక బెదరక, పట్టువదలకుండా స్థిర చిత్తంతో జ్ఞాన సముపార్జన చేయాలి.అప్పుడే ఈ కూప యంత్ర ఘటికా న్యాయమునకు న్యాయం జరుగుతుంది. 
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం