ఆధ్యాత్మిక, క్షాత్ర తేజం.. సంత్ సేవాలాల్ మహారాజ్... ; - రాథోడ్ శ్రావణ్
 🔹 బంజారా సమాజంలో సనాతన  హిందూధర్మ రక్షకుడు,
🔹తన భోధనలతో సమాజాన్ని సంఘటితం చేసి, భక్తి ఆయుధంగా సంస్కరణలు చేసిన యుగ పురుషుడు
🔹బంజారా సమాజాన్ని సన్మార్గంలో నడిపించడానికి కృషి చేసి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని ఉద్దీపింపజేసిన మహోన్నతమైన మానవతమూర్తి
🔹తన భవిష్యవాణితో సమాజాన్ని దిశా నిర్దేశాలు చూపించిన ఆధ్యాత్మిక గురువు
🔹భారత దేశంలో 18 కోట్ల బంజారాల ఆరాధ్యదైవం శ్రీ సద్గురు సంత్ శిరోమణి సేవాలాల్ మహారాజ్ గారి 284 వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ వ్యాసం
 శ్రీ సంత్ శిరోమణి సేవాలాల్ మహారాజ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్ జిల్లా గుత్తి మండలంలోని రాంజీ నాయక్ తాండాలోని రామావత్ గోత్రంలో  భీమానాయక్,  ధర్మణిమాత దంపతులకు 1739 లో కాళయుక్తి నామ సంవత్సరం మాఘమాసం శుక్లపక్షం 
ఫిబ్రవరి నెల 15 వ‌ తేది ఆదివారం రోజున మగ శిశువు జన్మించారు. తాండా వాసులు ఆనందంతో నృత్యాలు చేశారు. తల్లి మాయను అక్కడే భూమిలో పాతి పెట్టి దాని పై ఒక బండా వుంచారు. మూడవ రోజు దళవాధోకాయరో కార్యక్రమాలు చేశారు. 21 వ రోజున  దేవతలు (సాతిభవాని) వచ్చి ఉయ్యాలలో వేసి చెవిలో సేవా, సేవా, సేవా అని మూడు సార్లు  చెప్పి పాటలు పాడుతు పేరు పెట్టి ఆనందంగా వెళ్ళిపోయారు.
సంత్ సేవాలాల్ మహారాజ్ తండ్రి భీమానాయక్  ఆవులను పోషించేవారని వీరి ఇంట్లో అధిక సంఖ్యలో ఆవుల మంద ఉండేది.దంపతులిద్దరు జగదాంబ దేవి భక్తులు వీరికి  చర్లోపల్లి గ్రామం దగ్గర గొల్లలదొడ్డి సమీపంలో  సేవాఘడ్  తాండాలో  సేవాలాల్ అనే కుమారుడు జన్మించాడు.సేవాలాల్  చిన్నప్పుడు నుండి జగజ్జనని  జగదాంబ దేవి భక్తుడు.
12 సంవత్సరాల వయస్సులోనే అద్భుతమైన చమత్కారం చేసాడని అప్పటి నుండి తల్లిదండ్రులు తాండా ప్రజలు సేవాలాల్ ను దైవాంశ సంభూతుడుగా కొనియాడారు.
క్రీ.శ 18 వ శతాబ్దంలో భారత దేశం మొత్తం సంచరిస్తూ ఆవులను మేపుకుంటు  సమస్త బంజారా సమాజాన్ని జాగృతం చేసారు.తన జీవితాన్ని త్యాగం చేసి, తన బోధనలను మాటలకే  పరిమితం కాకుండా ప్రతీది ఆచరించి చూపించిన గొప్ప ఆధ్యాత్మిక గురువు. తన సమాజ ప్రజలతో భారతదేశమంతా తిరిగి గోవులను మేపుతు హిందూ ధర్మ గొప్పతనాన్ని  ప్రజలకు తెలియజేయడానికి కృషి చేసిన గొప్ప బ్రహ్మచారి. ఆ కాలంలో సమాజంలో పేరుకుపోయిన  దూరాచారాలన్ని, మూఢ నమ్మకాలు, జంతు బలి  మొదలగు ఆచారాలను వ్యతిరేకంగా పోరాడారు. బంజారా సమాజం పట్ల తనకున్న ప్రేమతో ప్రతి మనిషిని ప్రేమించి కోపతాపాలు లేకుండా సృష్టిలో ప్రతి  జీవి పైన ప్రేమ, దయ,కరుణ చూపించాలని కోరారు. తన సమాజానికి అనేక సంస్కరణలు  చూపారు.
సంత్ సేవాలాల్ మహారాజ్ జగదాంబ దేవి భక్తుడు.దేవి అనుగ్రహంతో గొప్ప ఆధ్యాత్మిక గురువుగా, భవిష్యత్తులో జరుగబోయేది ముందే చేప్పిన మహాజ్ఞాని, ఝమూరి జోల్ (ఝండీజోల్)
బావన్ బరాడ్,  దట్టమైన కీకారణ్యం ప్రాంతంలో
మాతా జగదాంబ దేవి ప్రత్యక్షమై సకల విద్యలు గోవుల సేవకుడు సంత్
 సేవాలాల్ మహారాజ్ ను దేవి నేర్పుతుండేది అని భజన గాయకులు తమ పాటలో చెపుతుంటారు.సంచార జీవితం నుండి తాండాల రూపంలో స్థిర నివాసం ఏర్పరుచుటకై తన వంతు కృషి చేశారని అందుకే ఈ రోజు 18 కోట్ల బంజారా ప్రజల ఆరాధ్య దైవంగా  ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు‌.  బంజారా తాండాలో  సంత్ సేవాలాల్ మహారాజ్, జగదాంబ దేవి ఆలయంలో రెండు జెండాలు ఉంటాయి. అందులో ఒకటి  గులాబీ రంగు, రెండోది తెలుపు రంగు ఈ రెండు జెండాలు విజయ చిహ్నంగా భావిస్తారు. 
సేవార్ బోల(  సేవాలాల్ భవిష్యవాణి):-
కలియుగం గూర్చి ఇలా ముందే చెప్పారు. ఇది సతియుగము ఆ తర్వాత కలియుగం వచ్చును, కలియుగంలో అల్లకల్లోలమగును, అమ్మకు బిడ్డ భారమగును, నీళ్ళ ప్యాకెట్లు మరియు ఒక రూపాయికి పదమూడు శెనగలు అమ్ముడు పోవును.
 మహమ్మారి గురించి ఇలా అన్నారు మనుషులకు రకారకాల రోగాలు రావచ్చు, వైద్యులు రోగాల పరీక్షలు చెయ్యొచ్చు, కాని రోగం ఏదో తెలియక పోవచ్చు మాట్లాడుతూ మాట్లాడుతూ రోగి చనిపోవచ్చు.
 ఇంటింటికి నాయకులు కావచ్చు, ఆకాల కష్టవిపత్తులు సంభవించవచ్చు,ఊరి పెద్దలు పంచాయతీ చేసి పేద ప్రజలను దండించి తినొచ్చు ,వాళ్ళ వంశం నరకం అనుభవించవచ్చు. అడవి నెమళ్ళలను తినొద్దు, గోవులను కసాయి లకు అమ్మొద్దు. ఈ ప్రపంచంలో మహిళల రాజ్యం రావచ్చు, చరవాణి గురించి అప్పట్లో అన్నారు క్షణంలోనే సమాచారం అంతటా వ్యాపించవచ్చు, అన్నదమ్ముల, తండ్రికొడుకుల,అత్తకోడళ్ళ కొట్లాటలు జరగొచ్చు. తోళారామ్ అనే పేరు గల అశ్వం పై కుసోని దక్కన్ పీఠభూమి ప్రాంతంలో గోదళము‌ తీసుకొని తిరుగుతూ నైజాం నవాబు గోదళమును చూసి భయపడి ప్రజలందరిని గమనించి బంజారా హిల్స్ లో ఉండండి అని వేడుకొనవచ్చు.
 ఎవరి పరిపాలన సాగునో వారు అబద్ధం చెప్పిన నిజమగును, సత్యం అసత్యమగును , స్త్రీల పై అత్యాచారం జరుగును, పాపిష్టుల కాలం రావచ్చు, వారి ఇంట్లో డబ్బులు కొదవ ఉండక పోవచ్చు, వీరి పాలన భరించలేక మనుషులు అడవీ బాట పట్టవచ్చు. ఒక ఆవు ఖరీదు లక్ష కావచ్చు గోవులకు మేత దొరక్కుండా పోవచ్చు వాటిని ఎవరు పట్టించకపోవచ్చు,గోవు కళేబరాలు కుప్పలు తెప్పలుగా పడొచ్చు, నేను చెప్పిన మాటలు అక్షరాలా నిజము కావచ్చు. 
సేవాలాల్ మహిమలు :- నరులను నారి చేసి ( చింగ్ రియ్యా  అనే యువకుని యువతి చేసి)
రాళ్ళతో డప్పు చేసె, మట్టితో నైవేద్యం చేసి, నిర్జీవిని సజీవి చేసిన సేవాభాయా కులమత భేదాలు లేకుండా ఆధ్యాత్మిక చింతనతో అద్భుతాలు సృష్టించి, అహింసా పాపము మత్తు మందు శాపము చెప్పిన సేవాభాయా బంజారా ప్రజలను సన్మార్గంలో నడిపించిన దేవుడు. 
హైదరాబాదులో గోవులను మేపుతున్న కాలంలో  సంత్ సేవాలాల్ మహారాజ్  మహిమను తెల్సుకున్న అప్పటి నిజాం ప్రభువు  సేవాలాల్ మహారాజ్ చిత్రపటాన్ని గీయించి తన మ్యూజియంలో  పెట్టినారని  బంజారా గాన గంధర్వులు(ఢాడి) కథల ద్వారా చేపుతుంటారు. 
 భారతదేశ భక్తి ఉద్యమ ప్రబోధకుల్లో మధ్యయుగం నుండి నేటి ఆధునిక యుగం వరకు ఘన కీర్తి ప్రతిష్టలు పొందుతున్న సంత్  సేవాలాల్ మహారాజ్  జీవితం గూర్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భక్తి ఉద్యమకారుల జాబితాలో చేర్చి ఈయన జీవితచరిత్రను పాఠ్యాంశంగా మార్చవలసిన అవసరం ఈ రోజుల్లో ఎంతో ఉంది. 
సంత్ సేవాలాల్ మహారాజ్ 1806 డిసెంబర్ 04న మహారాష్ట్ర లోని వాసీం జిల్లా మనోరా తాలుకా లోని ఉమ్రి తాండా సమీపంలో రూయిగడ్ ప్రాంతంలో పరమ దించారు. ఆయన సమాధి భారత దేశంలో ప్రసిద్ధి గాంచిన బంజారాల కాశీ పౌరాగడ్ లో ఉంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి  దేవేంద్ర ఫడ్నవీస్, మంత్రివర్యులు సంజయ్ బావు రాథోడ్  కలిసి మందిర నిర్మాణానికి ₹=593 కోట్లు మంజూరు చేసి తేది 12-02-2023 న పౌరాగడ్ పిఠాధిపతి సంత్ శేకర్ మహారాజ్ ఆధ్వర్యంలో  భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించింది.
 సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి  ఫిబ్రవరి 15 న  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజున సెలవు ప్రకటించాలిని. సేవాలాల్  జయంతిని  రాష్ట్ర మంతట ఒకే రోజున జరుపుకోవాలని  సేవాలాల్ ఉత్సాహ కమిటీ నాయకులు కోరుతున్నారు.
రచయిత - రాథోడ్ శ్రావణ్  ఉట్నూర్, అదిలాబాద్ జిల్లా, తెలంగాణ.9491467715


కామెంట్‌లు
Unknown చెప్పారు…
Tq sir from Rathod sravan
Unknown చెప్పారు…
ధన్యవాదాలు సార్
Unknown చెప్పారు…
సూపర్ సార్ బంజారా కోసం మీరు చేస్తున్న కృషి బాగా ఉంది
Unknown చెప్పారు…
సూపర్ సార్ మీరు చేస్తున్న కృషి బాగా ఉంది బంజారా కోసం
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
తెలుగు సాహిత్యము-కాసె సర్వప్ప కవి--తెలుగు సాహిత్యంలో కవిగా పేరు పొందిన వాడు కాసె సర్వప్ప కవి. ఈయన ఛందోబద్ధముగ, కవిత్వ లక్షణాలతో రాయ లేకపోయినప్పటికీ, ఇతడు రాసిన ద్విపద కావ్యం తర్వాత కాలం కవులకు కవిత్వం వ్రాయడానికి ఆధారమైంది. ఈయన రాసిన సిద్దేశ్వర చరిత్రమను నామాంతరం గల ప్రతాప చరిత్రమను ద్విపద కావ్యంగా ప్రసిద్దికెక్కింది.ఈ కావ్యమును అనుసరించి కాల నిర్ణయము చేయుట కష్టమని చరిత్ర కారులు అంటారు. కానీ ఈ కావ్యం చాలా పురాతనమైనదని చెప్పవచ్చును. ఈ గ్రంథము తర్వాత కాలంలో కూచిమంచి జగ్గకవి తను రాసిన సోమదేవ రాజీయ మునందు సర్వప్ప రాసిన ప్రతాప చరిత్రమను గ్రంధము నుండి అధిక భాగము సేకరించి యున్నాడు. అలాగే ప్రసిద్ధ కవి తిక్కన సోమయాజి చరిత్రమునందీ గ్రంధము నుండి చాలా భాగము ఉదహరించి రాసినాడు. ఇందుగల కొన్ని పంక్తులు గ్రహింపబడినవి. ద్విపద:- గణ ప్రసాదత గలిగిన సుతుని/గణపతి నామంబు ఘనముగా బెట్టి/తూర్పు దేశం బేగి తూర్పు రాజు లను/నేర్పుతో సాధించి యోర్పు మీరంగ/బాండు దేశాధీశు బాహు బలాఢ్యు/గాండంబులనుగొని గం డడగించి/చండవిక్రమ కళాసార దుర్వార/పాండిత్య ధనురస్త్రభద్రు డారుద్రు// ***. ***. ***. *** ఇది శ్రీసకలవిద్వదిభ పాద కమల/ సదమల సేవన సభ్యసంస్మరణ/భాసురసాధు భావనగుణానూన/భూసురాశీర్వాద పూజనీయుం డు/ కాసె మల్లన మంత్రి ఘనకుమారుండు/ వాసిగా జెప్పె సర్వప్పనునతడు.// కాసే సర్వప్ప రాసిన సిద్దేశ్వర చరిత్ర మరియు ప్రతాప చరిత్రము ఈ గ్రంథము కాదని వేరు వేరు గ్రంథాలని, కొందరు సాహితీ విమర్శకులు అంటారు. వాస్తవానికి ఈ కవి యొక్క ఇతర గ్రంథాలు కాలాదులు నిర్ణయించడానికి సరైన ఆధారాలు లేవు. కవిగా చరిత్రలో నిలిచాడు. *****. *****. *****. *****. ***** "*తెలుగు సాహిత్యము - భాస్కర పంతులు*" తెలుగు సాహిత్యములో భాస్కర పంతుల్ని ఒక కవిగా చెప్పుకుంటారు . ఈయన భాస్కరపంతులు కాదని భాస్కరాచార్యుడు అని కూడ తెలుస్తుంది. ఈ కవి తండ్రి పేరు బాల్లన. వీరి నివాస స్థానము పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇది చరిత్ర ప్రసిద్ధమైన గ్రామము కాదు. ఈయన రచించిన గ్రంథం పేరు "కన్యకా పురాణము" అనే ఎనిమిది ఆశ్వాసముల పద్యకావ్యము. ఈ పురాణములో ఒక కథ ఉంది. ఈ కథ చారిత్రిక కథను పోలి ఉంటుంది. పెనుగొండలో కుసుమ శెట్టి అను ఒక కోమటి ఉంటాడు. అతనికి ఒక కుమార్తె ఉంటుంది. ఆమెను విష్ణువర్ధనుడు అను రాజు కామించి తన కివ్వ మంటాడు. తండ్రి అయిన శెట్టి అందుకు అంగీకరించడు. అందుకు కోపోద్రిక్తుడైన విష్ణువర్ధన మహారాజు ఆ కన్యను బలాత్కారము చేస్తాడు. శెట్టి , ఆతని కూతురు అగ్నిహోత్రములో పడి మృతులయినట్టు, వారితో పాటు 102 గోత్రముల వారు మృత్యు లయ్యారు. అప్పుడు కన్యక కోమట్ల లో ఎనుబది కుటుంబములు తూర్పునకును, నూరు కుటుంబాలవారు పడమటకును, ఇన్నూరు కుటుంబములు దక్షిణమునకును, నూట ముప్పది కుటుంబములు ఉత్తరమునకును పారిపోయారు. కన్యకా శాపము చేత విష్ణువర్ధనుని శిరస్సు ముక్కలై మరణించాడు. అతని కుమారుడైన రాజ నరేంద్రుడు వైశ్యులను శాంత పరచి కుసుమ శెట్టి కొడుకు అయిన విరూపాక్షునికి పదునెనిమిది పట్టణములకు అధికారిగా చేసి కోమట్లను శాంత పరిచాడు. మిగిలిన వారిని పెనుగొండలో ఉండమన్న ట్లు చెప్పబడింది.ఇప్పటికిని పెనుగొండ కోమట్లకు ముఖ్య పుణ్యస్థలం. ఎక్కడ కన్యకా పరమేశ్వరి ఆలయము నిర్మింపబడినా, ఆ దేవత వైశ్యులచే పూజలందుకోబడుతున్నది. గ్రంథకర్త అయిన భాస్కర పంతులనుబ్రాహ్మణుడు పెనుగొండ, కొండవీడు, రాజ మహేంద్ర వరం మొదలైన ప్రదేశములందుండీన కోమట్ల కు గురువయ్యాడు. కన్యకా పురాణం రచించి వైశ్యుల విషయమై కొన్ని కట్టుబాట్లను చేసి వాటిని ఆధారముగా 102 గోత్రముల వారిని లోబరుచుకున్నాడు. ఈ ఏర్పాటుకు కాదన్న వారిని కులభ్రష్టులుగా చేసి బహిష్కరించాడు. తనకు లోకువ అయిన వారికి పురోహితుడయ్యాడు.ఇదీ కన్యకా పరమేశ్వరి కథ నేటికిని ప్రాచుర్యంలో ఉన్నది. ఈ కవి గురించి నిశ్చయముగా తెలియకపోయినప్పటికీ ఇతడు 16వ శతాబ్దము ముందు వాడని అనిపించు చున్నది.ఈతని కన్యకా పురాణము నుండి రెండు పద్యములు: ఉ. అంతట నింకితజ్ఞు డగు నాకుసుమాఖ్యుడు నాదరంబున్/గాన్తను జూచి పల్కె ననుకంప దలిర్పగ నీ మనంబున్/జింత వహించి యిట్లనికి చెప్పుము నీకు మనో రథార్థముల్/సంతసమంద నిత్తును విచారము మానుము దైన్య మేటికిన్// ***. ****. *** *** చ. జలనిధి మేరదప్పిన నిశాకరబింబము త్రోవ దప్పినన్/బలువిడి ధాత్రి క్రుంగినను భాస్కరు డిట్లుదయింప కుండినన్/గులగిరి సంచలించినను గూర్మము భూమి భరింపకుండినన్/బలికిన బొంక నేరరు కృపా నిధులై తగు వైశ్యు లెప్పుడున్// ***. *****. ‌‌. **** ‌‌. *** ఈ పద్యములందు "కన్యకా పరమేశ్వరి" కావ్య చరిత్రలో వైశ్యుల నీతి నిజాయితీల గురించి వివరింపబడింది, ఈ కన్యకా పురాణము వ్రాసిన భాస్కర పంతులనుఆచార్యుడు తెలుగు సాహితీ చరిత్రలో శాశ్వతంగా నిలిచాడు.(54 విభాగము)-- బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబరు:9290061336
చిత్రం
మహాభారతంలో ధర్మరాజుకు వాడిన పేర్లు.: -డా.బెల్లంకొండనాగేశ్వరరావు.
భళిరే నైరా
చిత్రం
కాలములు - వర్తమాన కాలం - భూత కాలం - భవిష్యత్ కాలం - తద్ధర్మ కాలం వివరణను ఉపాధ్యాయులు కూకట్ల తిరుపతి ర్'ఇస్తారు వినండి. 
చిత్రం