పసుపు-చర్మ రోగాన్ని పోగొడుతుంది. గాయాలు బ్యాక్టీరియా'ను నాశనం చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. విషాన్ని హరిస్తుంది. కుష్టు రోగాన్ని కూడా పోగొడుతుంది.
ఇలా బొట్టు పెట్టుకోవడం వల్ల శరీరానికి ప్రాణశక్తి వృద్ధి అవుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇతరుల దృష్టి దోషాలు నశిస్తాయి. ఈనాటి నాగరికత అలంకారాల్లో లభించే కృత్రిమ వస్తువులు ధరించడం అనారోగ్యకరం.
మనం ధరించే వస్తువులు, పూజలకు ఉపయోగించే పువ్వులు మొదలగు వస్తువులూ, ప్రసాదంగా స్వీకరించేవి, తీర్ధంగా స్వీకరించేవి, యజ్ఞాల్లో సమర్పించేవి, వ్రతాల్లో వాడేవి-ఇలా మన జీవితంలో దేశ, కాల పరిస్థితుల్ని బట్టి-ఉపయోగించే వస్తువులు, పాటించే ఆచారాలు అన్ని విజ్ఞాన శాస్త్రం, వైద్యశాస్త్రం, యోగ శాస్త్రం, ఆధ్యాత్మిక శాస్త్రం, జ్యోతి శాస్త్రం, ఆధారంగా మనకు ఆరోగ్యాన్ని పవిత్రతను, ఆనందాన్ని చేకూర్చేవి తప్ప, గ్రుడ్డి నమ్మకాలు మాత్రం కావు. ఆభరణాల్లో ధరించే నవరత్నాల్లో కూడా ఆయా కాంతిని బట్టి-మనపై విశేష ప్రభావాన్ని చూపేవే.
పసుపులోని గొప్ప గుణాలు.;-తాటి కోల పద్మావతి గుంటూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి