*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 077*
 కందం:
*ఓరిమియె కలిగి యుండిన*
*వారలగని ప్రజ్ఞలేనివారని యెద లో*
*నారయ సత్పురుషావళికి*
*నోరిమియే భూషణంబు రోరి కుమారా !*
తా:
కుమారా! మంచి ప్రవర్తన కలవారు అందరూ కూడా ఓరిమి/ ఓర్పు, సహనము కలిగి ఉండాలి. కానీ, అలా సహనముతో నడుచుకుంటున్న వారిని చూసి, ఈ సమాజము చేతకానివారు, తెలివిలేని వారు అనుకుంటారు. అయినప్పటికీ, సజ్జనులు, మంచివారు ఓర్పు, సహనమయతో నడుచుకుంటూ ఉండడమే వారికి గౌరవము తెస్తుంది............ అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*పాండవులు అరణ్యవాసంలో, అజ్ఞాతవాసం లో ఉన్నప్పుడు కౌరవులతో పాటు సమాజంలో ఉన్న వారు కూడా వారిని చేత కాని వారు, యద్ధనైపుణ్యం లేని వాళ్ళు అన్నారు. అలాగే, సీతా రాములు 14 ఏళ్ళు వనవాసం చేసినప్పుడు కూడా, రాముడే దేవుడు కదా రావణుని ఒక్క బాణం వేసి చంపేయగలిగి వుండి కూడా చేతకాని వాడులాగా ఎందుకు ఉండిపోయాడు అని లోకం హేళన చేసింది. ఎవరు ఏమనుకున్నా, ద్వాపరంలో అయినా త్రేతాయుగము లో అయినా పాండవులు, రామచంద్రుడు తమ ఓర్పును కోల్పోలేదు, వదలి పెట్టలేదు. వీరేకదా, మనకు ఆదర్శపురుషులు. అందుకే, అవకాశం ఉన్నంత వరకూ ఓపికని సహనాన్ని కోల్పోకుండా ఉండగలిగే మానసిక నిబ్బరాన్ని మనకు ఇవ్వమని....... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు