అందివచ్చిన సాంకేతికతతో
అరచేతిలో ప్రపంచం.
సమాచార వినిమయమే
అతి పెద్ద సౌకర్యం.
వ్యక్తిగత విషయాల గోప్యతలో
అదృష్టానిదే అసలు విజయం.
సమాచార తస్కరుల చేతుల్లో
అతి సున్నితమైన రహస్యం.
నాగరికత నర్తిస్తున్న లోకంలో
భద్రతకు భరోసా శూన్యం.
స్మార్టవుతున్న కొద్దీ మనం
కోల్పోతున్నది అమూల్యం.
సైబర్ ప్రపంచంలో కనిపించేదంతా
క్షణాల్లో అవుతున్నది అదృశ్యం.
నీవు,నేనూ,ఆడ,మగా
ముసలి,వయసూ కాదేదీ అనర్హం.
చట్రబంధ వ్యూహాలతో తస్కరుల
అనంతమైన మాయాజాలం.
వలల భ్రమల్లో కొందరు,
అమాయకంగా ఇంకొందరు,
నిర్లక్ష్యంగా మరికొందరు,
అత్యాశతో కొందరు,
అన్నీ పోగొట్టుకుంటున్నారు.
పారాహుషార్!పారాహుషార్!!
అందమైన చరవాణుల వినియోగదారులు
హమేషా జాగ్తే రహో!
నాణేనికి మరోవైపు ఉందహో!!
అమ్మ ఒడి కాదది!
సైబర్ మాయాకౌగిలది!!
అరచేతిలో ప్రపంచం.
సమాచార వినిమయమే
అతి పెద్ద సౌకర్యం.
వ్యక్తిగత విషయాల గోప్యతలో
అదృష్టానిదే అసలు విజయం.
సమాచార తస్కరుల చేతుల్లో
అతి సున్నితమైన రహస్యం.
నాగరికత నర్తిస్తున్న లోకంలో
భద్రతకు భరోసా శూన్యం.
స్మార్టవుతున్న కొద్దీ మనం
కోల్పోతున్నది అమూల్యం.
సైబర్ ప్రపంచంలో కనిపించేదంతా
క్షణాల్లో అవుతున్నది అదృశ్యం.
నీవు,నేనూ,ఆడ,మగా
ముసలి,వయసూ కాదేదీ అనర్హం.
చట్రబంధ వ్యూహాలతో తస్కరుల
అనంతమైన మాయాజాలం.
వలల భ్రమల్లో కొందరు,
అమాయకంగా ఇంకొందరు,
నిర్లక్ష్యంగా మరికొందరు,
అత్యాశతో కొందరు,
అన్నీ పోగొట్టుకుంటున్నారు.
పారాహుషార్!పారాహుషార్!!
అందమైన చరవాణుల వినియోగదారులు
హమేషా జాగ్తే రహో!
నాణేనికి మరోవైపు ఉందహో!!
అమ్మ ఒడి కాదది!
సైబర్ మాయాకౌగిలది!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి