ఉత్తమ రైతు- శ్రీ కోటిరెడ్డి (35);- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322


 వ్యాపారాత్మక ధోరణిలో సాగతీత సీరియల్స్ వస్తున్నాయి. దాని వల్ల సమాజంలో మార్పు రాదు అనేది జగమెరిగిన సత్యం.  హక్కులను కోరుకునే ముందు బాధ్యతలను విస్మరించరాదు  అన్నది లోక నీతి అందని అందలాల కోసం అభివృద్ధి కుంటు పడడం సంపాదించిన విజ్ఞానాన్ని  తానున్న చోటికి సద్వినియోగం చేస్తే యువత భవిష్యత్తు ఉజ్వలమవుతుంది  దేశం ప్రగతి పథంలో ముందుకు సాగుతోంది  చదువు జ్ఞానాన్ని పెంచుకోవడం కోసమే కానీ ఎవరి దగ్గర ఊడిగం చేయడం కోసం కాదు  మన చుట్టూ ఉన్న ప్రతి గడ్డి పరక విలువైనదే  పనికి వచ్చేదే ఈ పరిసరాలను వెతికితే నీకు మార్గం దొరుకుతుంది ఉన్నత స్థితిని అన్వేషించి మీ విజ్ఞానాన్ని దానికి అనుసంధించండి. మీకు లేనిది ఏమీ లేదు ఎక్కడ పడ్డామో అక్కడే వెతకాలి. ఆ వెతికిన చోటనే ఫలితం దక్కుతుందని తోటి యువకులకు  సలహాలనిస్తూ తెలియని విషయాలు  తమ తండ్రి దగ్గర లేక తెలిసిన వారి దగ్గర తెలుసుకొని  చిత్త శుద్ధితో  నిర్వహిస్తున్న  వరుణ్ అభినందనీయుడు  విద్యార్థికుడైన కుమారుడు వరుణ్ లో కూడా ఈ తత్వాన్ని ప్రవేశపెట్టారు. దూసుకుపోయే తత్త్వం యవ్వనంలోనే  కలిగిన వాడు కనుక యువకులలో తండ్రి చూసిన పద్ధతిని వారికి వివరించి చెప్పి వారిలో చక్కటి అవగాహన కల్పించడం జరిగింది  తనను గురించి తెలుసుకున్న కొంతమంది రాజకీయ నాయకులు  మా పార్టీలో రమ్మని బలవంత పెట్టడం  దానికి అంగీకరించక  తనకు నచ్చిన నాయకుని గురించి యువతకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను తప్ప పార్టీలో చేరాలని చెప్పిన తండ్రికి తగిన తనయుడు.

యువకులను అందరినీ చేర్చి విద్య పట్ల అభిలాష కలిగించి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని తన సంకల్పం.  తల్లి పేదవారిని ఎలా ఆదుకుంటుందో దానిని ఆదర్శంగా తీసుకొని చాలామంది యువకులతో  పనులను చేయించడం నేర్చుకున్నాడు. తల్లి పేద ప్రజలను చేరదీసి వారికి తెలిసిన పనులను చేయడానికి అవసరమైన  సహాయ సహకారాలను  అందిస్తుంది  ఒక తల్లికి మిషన్ పని తెలిసి మిషన్ కొనే స్తోమత లేని వాడిని  ఒక బృందంగా ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారా సహాయం చేయిస్తుంది  అది కూడా చాలని కొంతమందికి తనే సహకరిస్తుంది  సహాయం చేస్తుంది  ఆర్థికంగా కూడా  అబ్యాగతులు ఎవరు వచ్చినా సకల మర్యాదలు చేసి పెడుతుంది అన్నపూర్ణమ్మలాగా  వచ్చిన వారు పెద్ద వాళ్ళా చిన్న వాళ్ళా అని కూడా చూడదు  సకల మర్యాదలు చేసి పంపుతుంది  అది తన రక్తంలో ఉన్న గుణం.


కామెంట్‌లు